Sunday, December 22, 2024

జగన్ కు ఆదానీ దెబ్బ,,,,

- Advertisement -

జగన్ కు ఆదానీ దెబ్బ,,,,

Adani slap to Jagan

విజయవాడ, నవంబర్ 22, (వాయిస్ టుడే)
దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి సంబంధించిన ఓ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. సోలార్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఓ భారీ డీల్ కుదుర్చుకునేందుకు.. ప్రభుత్వ అధికారులకు పెద్ద మొత్తంలో లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్- ఎఫ్‌బీఐ విచారణ చేపట్టింది.ఈ వివాదాస్పద వ్యవహారం క్రమంగా.. ఆంధ్రప్రదేశ్ గత సర్కార్ కు చుట్టుకుంటోంది. 2019- 2024 మధ్య అధికారంలోని ప్రభుత్వంతో గౌతమ్ అదానీ.. ఈ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు నడిపినట్లు ఆమెరికా విచారణ సంస్థ ఎఫ్‌బీఐ పరిశోధనలో వెల్లడైంది. ఇందుకోసం.. దాదాపు రూ.1,750 కోట్లు చేతులు మారినట్లు అమెరికా విచారణ సంస్థ.. ఆ దేశ కోర్టుకు సమర్పించిన ఫైలింగ్ లో వెల్లడించింది.లాభదాయకమైన సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు రూ. 2.029 కోట్లు లంచం ఇచ్చినందుకు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీ, మరో ఆరుగురు వ్యక్తుల ప్రయత్నించినట్లు ఎఫ్‌బీఐ ఆరోపించింది. ఈ వ్యవహారంలో మరింత లోతైన దర్యాప్తు చేపడతామని ప్రకటించిన ఆమెరికా విచారణ సంస్థ.. ప్రాథమిక నివేదికను కోర్టుకు అందించింది. ఈ కుట్రలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తి సహకారం ఎక్కువగా ఉందన్న ఎఫ్‌బీఐ.. తేదీలతో సహా వారి మధ్య భేటీలను వెల్లడించి, ఆశ్చర్యపరిచింది.భారత్ లో అతిపెద్ద సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సహా మరో ఆరుగురు.. ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వజూశారని అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ ఆరోపిస్తోంది. అయితే.. ఈ ఒప్పందాలను చూపించి బ్యాంకులు, ఇన్వెస్టర్లను తప్పుడు సమాచారంతో మోసం చేసి నిధులు సమీకరించేందుకు ప్రయత్నించారనేది ప్రధాన ఆరోపణ. ఇందులో ఆమెరికా ఇన్వెస్టరు సైతం ఉండడంతో.. తమ దేశ పెట్టుబడిదారుల్ని మోసం చేస్తున్నారన్న కారణంతో ఆమెరికా దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తునకు సంబంధించిన అంశాలను తెలుపుతూ.. కోర్టులో ఎఫ్‌బీఐ ఫైలింగ్ చేసింది.రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు.. అదానీ గ్రీన్ ఎనర్జీ గ్రూప్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల సహకారం కోరిన అదానీ, ఇతర నిందితులు.. ప్రతిగా భారీగా లంచాలు ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. భారత ప్రభుత్వంలోని వ్యక్తులకు రూ.2,029 కోట్లు లంచంగా ఇచ్చేందుకు ప్రయత్నించారని ఎఫ్‌బీఐ నివేదికలో పేర్కొంది. విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకునే ఒప్పందాలతో అదానీ గ్రీన్ ఎనర్జీ, దాని అనుబంధ సంస్థలకు పెద్ద మొత్తంలో లాభం చేకూరుతుందని పేర్కొంది.సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల మధ్య విద్యుత్ విక్రయ ఒప్పందం  కుదుర్చేందుకు అదానీ స్వయంగా ప్రయత్నించారు. ఇందుకోసం.. అతను ఆంధ్రప్రదేశ్ లోని అత్యున్నత స్థాయి కార్యనిర్వహాక వ్యక్తిని కలిశారు అని అమెరికా విచారణ సంస్థ ఎఫ్ బీఐ స్పష్టంగా వెల్లడించింది. ఇక్కడే అసలు విషయం పూర్తిగా వెల్లడైంది. ఆమెరికా విచారణ సంస్థ తేదీలతో సహా తెలిపినట్లుగా..2021లో గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. నాడు విద్యుత్ సరఫరా ఒప్పందాలపై చర్చలు జరిగినట్లు ప్రభుత్వం తెలపగా.. దాదాపు ఏడు మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు ముఖ్యమంత్రి జగన్ అంగీకారం తెలుపారు. ఇది.. భారత్ లోని మరే ఇతర రాష్ట్రాలు చేసుకోలేనంత భారీ ఒప్పందంగా.. అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వెల్లడించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్