అడిషనల్ ఎస్పీ యస్. మల్లారెడ్డి ఎస్పీగా పదోన్నతి
Additional SP Mallareddy promoted as SP
సిద్దిపేట
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లో అడిషనల్ డీసీపీ శాంతిభద్రతలుగా విధులు నిర్వహిస్తున్న యస్. మల్లారెడ్డి ఎస్పీగా పదవున్నతి పై రాచకొండ ట్రాఫిక్ డిసిపి గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్బంగా పదోన్నతి పొందిన ఎస్పీ మల్లారెడ్డి, పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల మొక్కను అందజేశారు. కమిషనర్ ఎస్పీగా పదోన్నతి పొందినందుకు అభినందించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ. మల్లారెడ్డి అడిషనల్ డీసీపీగా 2-08-2023 నుండి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లో విధులు నిర్వహించడం జరిగిందన్నారు. విధినిర్వహణలో అంకితభావంతో నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ మంచి గుర్తింపు పొందడం జరిగిందన్నారు.
పదోన్నతులతో పాటు బాధ్యతలు పెరుగుతాయని, అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహించే అధికారులు విధుల్లో రాణిస్తారని పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఎస్బి ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీధర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్, కార్యాలయ సూపరిండెంట్లు మహమ్మద్ ఫయాజుద్దీన్, మహమ్మద్ అబ్దుల్ ఆజాద్, సీసీ నితిన్ రెడ్డి, పిఆర్ఓ మల్లికార్జున్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు.