ఎల్బీనగర్, వాయిస్ టుడే: ఎల్బీనగర్ నియోజకవర్గ చంపాపేట్ డివిజన్ పరిధిలోని బైరామల్ గూడ సీతారామ నగర్ బస్తీకి చెందిన కరాటే యాదమ్మ, పలువురు మహిళలు, యువకులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎల్.బి.నగర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, వారి యొక్క విధివిధానాలు నచ్చి పార్టీలోకి చేరుతున్నామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సుధీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని హామీనిచ్చారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రత్యర్ధుల మైండ్ బ్లాక్ అయిందని తెలిపారు. వారు విడుదల చేసిన మేనిఫెస్టో అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకే ఓటు వేసి అసెంబ్లీకి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గజ్జల మధుసూధనరెడ్డి, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్మన్ నల్ల రఘుమారెడ్డి, నాయకులు సుంకోజు కృష్ణమాచారి, డివిజన్ అధ్యక్షులు రాజిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు రోజారెడ్డి, నాయకులు అంజిరెడ్డి, సురేందర్ రెడ్డి, సత్యప్రకాశ్, శేఖర్ రెడ్డి, మల్లేష్ గౌడ్, జగదీష్ గౌడ్, వసంత, లక్ష్మి, పలువురు నాయకులు, బస్తీవాసులు పాల్గొన్నారు.