ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలి
హైదరాబాద్
Adi Srinivas should be given minister post

కాంగ్రెస్ మాజీ ఎంపి వి హెచ్ ఇంట్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మున్నూరు కాపు నేతల సమావేశం జరిగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీర్మానం..నామినేటెడ్ పోస్టుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేతలు కోరారు. కులగణనలో పలు సందేహాలు ఉన్నాయని..ప్రతి గ్రామంలో కులగణన వివరాలు ప్రభుత్వం డిస్ ప్లే చేయాలని నిర్ణయించారు. మున్నూరు కాపు ల జనాభా ప్రభుత్వం తక్కువ చేసి చూపెట్టిందని..అందుకు ప్రత్యేకంగా కులం తరుపున సర్వే కమిటీ వేసుకున్నారు. మున్నూరుకాపు కార్పొరేషన్ ను కో ఆపరేటివ్ సొసైటి లాగా తుతూ మంత్రంగా ఏర్పాటు చేశారని..పూర్తి స్థాయి కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ ను నియమించాలని నిర్ణయించారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కనీసం 20వేల మందికి విద్యా,ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని తీర్మానించారు. కోకాపేట లో గత ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల భూమిలో మున్నూరు కాపు భవన నిర్మాణం కోసం.. ప్రస్తుతం అక్కడ భూమి ఉన్న పరిస్థితుల దృష్ట్యా..దాన్ని సమంతరం చేసి భవన నిర్మాణం చేసుకునేందుకు వీలుగా నిధుల సంఖ్య పెంచాలని కోరారు. మున్నూరు కాపు భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఏకగ్రీవ నిర్ణయం చేసారు. తాజా రాజకీయాలపై చర్చించి..పార్టీలకు అతీతంగా సంఘటితంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు.