కరీంనగర్ శిశుగృహ నుండి నలుగురు శిశువుల దత్తత

- Advertisement -

కరీంనగర్ శిశుగృహ నుండి నలుగురు శిశువుల దత్తత

Adoption of four babies from Karimnagar orphanage

కరీంనగర్
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహలో పెరుగుతున్న నలుగురు శిశువులను ఒకేరోజు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతులమీదుగా పిల్లలు లేని దంపతులకు దత్తత ఇచ్చారు.
కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జరిగిన ఈ దత్తత కార్యక్రమం ద్వారా ఇద్దరు మొగ, ఇద్దరు ఆడ శిశువులను దత్తత ఇచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని అన్నారు. ఇందుకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, భగత్ నగర్ కరీంనగర్ లో సంప్రదించాలన్నారు. రక్త సంబంధీకుల నుండి చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలనుకునే వారు కూడా ఈ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి, డిసిపిఓ పర్వీన్, పి.ఓ తిరుపతి, శిశు గృహ మేనేజర్  తేజస్వి, ఔట్ రీచ్ వర్కర్ రమేష్, సోషల్ వర్కర్ రాజేష్ పాల్గొన్నారు.
బాల్య వివాహ్ ముక్త్ భారత్ పోస్టర్ ఆవిష్కరణ:
బాల్య వివాహ్ ముక్త్ భారత్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  డిసెంబర్ 10 తేదీ వరకు కరీంనగర్ జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలన ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాల గురించి జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలని బాల్య వివాహాల నిర్మూలన అధికారులుగా ఉన్న ఆర్డీవోలు, తహసీల్దార్లు సిడిపిఓలను ఆదేశించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular