Thursday, February 20, 2025

పెట్రోల్ పంపులో కల్తీ డీజిల్ కలకం

- Advertisement -

పెట్రోల్ పంపులో కల్తీ డీజిల్ కలకం

Adulterated diesel mixture at the petrol pump

వికారాబాద్
పెట్రోల్ డీజిల్ బంక్ లలో కల్తీలకు  పాల్పడుతుండటంతో తమ వాహనాలు చెడిపోతున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా పరిగి కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంక్లో డీజిల్ లో కల్తీ జరిగిందని వినియోగదారులు ఆందోళనకు దిగారు. డీజిల్ లో కల్తీ జరిగింది అంటూ వినియోగదారులు పెట్రోల్ బంక్ సిబ్బందిని నిలదీశారు. పంపులో పని చేస్తున్న వ్యక్తులు ఒక్కో పంపులో ఒక్కో రకంగా డీజిల్ ఉంటుందని అన్నారు.  మీకు కావాలంటే డెన్సిటీ చూపిస్తాం ,డిజిల్ లో మీటర్ పెట్టి చూపించడం జరిగింది. డీజిల్ డబ్బులో నురగలు రావడం డబ్బా కింది భాగం వాటర్ కనిపించడంతో వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు వేల రూపాయలు ఇచ్చి జెసిబిలు, ట్రాక్టర్లు లారీలు, కార్లలో డీజిల్ వేయిస్తున్నాం. పంపులలో కల్తీ డీజిల్ విక్రయిస్తే ఆలస్యంగా వాహనాలు రిపేర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తొందరగా రిపేర్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్ ,డీజిల్ లో కల్తీలకు పాల్పడే పెట్రోల్ బంక్ లపై చట్టరీత్యా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పెట్రోల్ డీజిల్ వినియోగదారులు డిమాండ్ చేశారు. డీజిల్ను డెన్సిటీ చేసి చూపించిన పంపులో పనిచేసిన వ్యక్తులు టెస్ట్ పేపర్ పై టెస్ట్ చేసి చూపకపోవడం పట్ల పెట్రోల్ డీజిల్ వినియోగదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ లో డీజిల్ లో మరి టెస్ట్ పేపర్ పై ఎందుకు టెస్టు  చేయలేదని వినియోగదారులు నిలదీస్తున్నారు.
పెట్రోల్ డీజిల్ వినియోగదారులకు డెన్సిటీ పట్ల పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం సిబ్బంది ఎంత చెబితే అంతకి ఒప్పుకోవడం అనేది వినియోగదారులకు అర్థమయ్యే విషయం. కానీ ఇక్కడ టెస్ట్ పేపర్ పై డీజిల్ గాని పెట్రోల్ గాని ఒక చుక్క వేస్తే మొత్తం విస్తరిస్తుంది . ఏమాత్రం కల్తీ ఉన్నా వెంబడి టెస్ట్ పేపర్ పై మచ్చల రూపకంగా వినియోగదారులకు కనబడుతుంది. కనుకనే టెస్ట్ పేపర్ పై టెస్ట్ చేయకుండా అక్కడ సిబ్బంది తప్పుతోవ పట్టించారని ఆరోపించారు.  అధికారులు కల్తీలకు పాల్పడుతున్న పెట్రోల్ పంపు లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్