Tuesday, April 28, 2026

3వ సారి ప్రధాని అయ్యాక.. 3వ స్థానంలోకి వెళతాం

- Advertisement -

భోపాల్, నవంబర్ 8, : మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలోప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దమో ప్రాంతంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన…మూడోసారి తాను ప్రధాని అవుతానంటూ ధీమా వ్యక్తం చేశారు. అంతే కాదు. మళ్లీ ప్రధాని అయిన తరవాత దేశ ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. 2014 తరవాత భారత్‌ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని గుర్తు చేశారు. “2014 తరవాత మేం అధికారంలోకి వచ్చాం. ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇండియాని 200 ఏళ్ల పాటు పరిపాలించిన బ్రిటన్‌ని కూడా వెనక్కి నెట్టేశాం. నేను మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తరవాత భారత ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలోనే నంబర్ 3 స్థానానికి తీసుకెళ్తాను”ప్రతి రంగంలోనూ భారత్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని అన్నారు ప్రధాని మోదీ. చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌ ద్వారా వేరే ఏ దేశమూ సాధించని లక్ష్యాన్ని సాధించగలిగామని కొనియాడారు. భారత్ G20 సదస్సుకి నేతృత్వం వహించడాన్నీ ప్రపంచ దేశాలు ప్రశంసించాయని వెల్లడించారు. అటు భారత క్రీడాకారులు కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారని వివరించారు ప్రధాని మోదీ. ఇదే సమయంలో కాంగ్రెస్‌కి గురి పెట్టారు. 85% కమిషన్ పార్టీ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని ఉద్దేశిస్తూ ఆ పార్టీ తమ నేతల్ని రిమోట్‌ కంట్రోల్‌తో కట్టడి చేస్తుందని సెటైర్లు వేశారు. ఆ పార్టీతో ప్రజలకు జాగ్రత్తగా ఉండాలంటూ చురకలు అంటించారు. పేదలకు చెందాల్సిన డబ్బుల్ని దొంగిలిస్తోందని విమర్శించారు

After becoming the prime minister for the 3rd time.. we will go to the 3rd place
After becoming the prime minister for the 3rd time.. we will go to the 3rd place

కలాం, బాలయోగిలకు పదవులు ఇచ్చింది మేమే

బీఆర్ఎస్‌ ,కాంగ్రెస్‌సీ టీం అని, కాంగ్రెస్‌ బీఆర్ఎస్‌ సీ టీం అంటూ మోడీ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల డీఎన్‌ఏలు రెండు ఒక్కటే నని, రెండు కుటుంబపార్టీలేనని టార్గెట్ చేశారు. ప్రధాని మోడీ స్పీచ్‌ ఇక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత సీన్‌ మార్చేశారు. బీసీలు, తెలుగుదేశం పార్టీ సెంట్రిక్‌గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బీసీలను అక్కున చేర్చుకుంది. ఆ పార్టీకి ఉన్న బీసీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకే బీజేపీ బీసీ మంత్రాన్ని జపిస్తోందన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది. బీసీలకు ఎక్కువ అసెంబ్లీ టికెట్లు ఇచ్చిందంటూనే, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. దాదాపు 30 దశాబ్దాల పాటు టీడీపీకి అండగా ఉన్న బీసీలు చాలా మంది వేర్వేరు పార్టీల్లో చేరిపోయారు. ఉన్న కొద్ది మంది ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మోడీ బీసీ మంత్రం జపిస్తున్నారు బీజేపీ నేతలు. ప్రధానమంత్రి మోడీ ఎక్కడా టీడీపీ, ఎన్డీఏ ప్రస్తావన లేకుండా వాజ్‌పేయ్‌ హయాంలో పదవుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిని చేసింది, దళితుడైన జీఎంసీ బాలయోగిని స్పీకర్‌ నియమించింది బీజేపీయేనని గుర్తు చేశారు. అబ్దుల్‌ కలాం రాష్ట్రపతి కావడం, జీఎంసీ బాలయోగి లోక్‌సభ స్పీకర్‌ పదవులు చేపట్టింది ఎన్డీఏ ప్రభుత్వం హయాంలోనే. నేషనల్ డెమోక్రటిక్‌ అలయన్స్‌ క్రెడిట్‌ను బీజేపీ ఖాతాలోకి వేసుకునేందుకు ప్రయత్నించారు. ప్రస్తుత టీడీపీ చీఫ్‌ చంద్రబాబు అప్పటి ఎన్డీఏ కన్వీనర్‌గా ఉన్నారు. అబ్దుల్‌ కలాంను పట్టుబట్టి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒప్పించానని చాలా సార్లు చెప్పుకున్నారు. అలాగే జీఎంసీ బాలయోగి స్పీకర్‌ పదవి చేపట్టినపుడు కూడా ఎన్డీఏ కన్వీనర్‌గా చంద్రబాబు నాయుడే ఉన్నారు. ప్రధాన మంత్రి మోడీ స్పీచ్ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఎన్డీఏలో హయాంలో అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా, పీఏ సంగ్మా బాలయోగిలను లోక్ సభ స్పీకర్లు ఎన్నుకుంటే ఆ క్రెడిట్ లో వేసుకున్నారు. వాజ్ పేయ్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఈ పేర్లను ప్రతిపాదన ఎవరు చేసినప్పటికీ, ఎన్డీఏలోని భాగస్వామయ్య పార్టీలన్ని అబ్దుల్ కలాం, బాలయోగి పోటీపై మూకుమ్మడిగా చర్చించాయి. గెలుపు లెక్కలు వేసుకున్నాయి. ఆ తర్వాత వారిద్దర్ని గెలిపించుకున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటే వాటిని భారతీయ జనతా ఖాతాలో వేసుకోవడం, తప్పులు జరిగితే వాటిని ఎన్డీఏ కూటమి వేస్తున్నారన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. అప్పటి ఎన్డీఏలో కాంగ్రెస్ ను వ్యతిరేకించిన పార్టీలు ఎన్నో ఉన్నాయి. ఆ పార్టీలకు అసలు క్రెడిట్ ఇవ్వకుండా తమ అంతా చేశామని చెప్పుకోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. జీఎంసీ బాలయోగి టీడీపీ ఎంపీ, అయినా మోదీ టీడీపీ పేరు కానీ, చంద్రబాబు పేరు కానీ తీసుకురాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతి, అక్రమాలపైన ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. కుటుంబపాలన సాగుతోందని, ఎవరు ప్రజాధనాన్ని దోచుకున్నారో వారి నుంచి రాబడతామని ప్రకటించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజ్‌ ప్రభుత్వం వైఫల్యమేనన్న మోడీ…అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించారు. బీఆర్ఎస్‌ వైఫల్యాలను ఎత్తిచూపిన మోడీ…ఒక తరం జీవితాలను గులాబీ పార్టీ నేతలు నాశనం చేశారంటూ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన ప్రధాని మోడీ…బీసీల ఆకాంక్షలను పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్