Sunday, September 8, 2024

ఏహెచ్‌64 అపాచీ  బోయింగ్‌  హెలికాప్టర్ల  తయారీ హైదరాబాద్‌లోనే

- Advertisement -

హైదరాబాద్‌, ఆగస్టు17: భారత సైన్యం కోసం అపాచీ హెలికాప్టర్ల తయారీని బోయింగ్‌ ప్రారంభించింది. అమెరికాలోని అరిజోనాలో బోయింగ్‌కు చెందిన మెసా ఉత్పాదక కేంద్రంలో ఏహెచ్‌64 అపాచీ ఈ-మాడల్‌ హెలికాప్టర్లు సిద్ధమవుతున్నాయి. మొత్తం 6 హెలికాప్టర్లు ఇండియన్‌ ఆర్మీకి డెలివరీ కానున్నాయి.

AH64 Apache Boeing Helicopters are manufactured in Hyderabad
AH64 Apache Boeing Helicopters are manufactured in Hyderabad

కాగా, ఈ హెలికాప్టర్ల బాడీ ఫ్యూజ్‌లేజ్‌లు హైదరాబాద్‌లోని టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌,టీబీఏఎల్‌, ప్లాంట్‌లోనే రెడీ అవుతున్నాయి.

ఈ ఏడాది ఆరంభంలోనే తొలి ఏహెచ్‌64 అపాచీ ఈ-మోడల్‌ హెలిక్యాప్టర్‌ ఫ్యూజ్‌లేజ్‌ ఇక్కడి నుంచి అమెరికాకు చేరింది. ఈ క్రమంలోనే అక్కడి ప్లాంట్‌లో హెలికాప్టర్ల తయారీని మొదలుపెట్టినట్టు బోయింగ్‌ తాజాగా ప్రకటించింది.

ఈ మేరకు బోయింగ్‌ ఇండియా అధ్యక్షుడు సలీల్‌ గుప్టే తెలియజేశారు. 2020లో బోయింగ్‌.. 22 ఈ-మోడల్‌ అపాచీ హెలిక్యాప్టర్లను ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు అందజేసింది. దీంతో ఇండియన్‌ ఆర్మీ కోసం 6 ఏహెచ్‌64 అపాచీ ఈ-మోడల్‌ హెలిక్యాప్టర్ల కాంట్రాక్టును దక్కించుకున్నది.

వచ్చే ఏడాదిలోగా వీటిని అందిచాలన్నది డీల్‌. ఏహెచ్‌64ఈ.. ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన దాడుల హెలిక్యాప్టర్‌గా పేరొందినట్టు ఈ సందర్భంగా బోయింగ్‌ మెసా ప్లాంట్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, అటాక్‌ హెలిక్యాప్టర్‌ ప్రోగ్రామ్స్‌ విభాగం ఉపాధ్యక్షుడు క్రిస్టినా ఉఫా తెలిపారు.

  • ఏహెచ్‌64 అపాచీ ఈ-మాడల్‌.. ట్విన్‌-టర్బోషాఫ్ట్‌ అటాక్‌ హెలికాప్టర్‌
  • ఇందులో అత్యాధునిక రాడార్‌ వ్యవస్థ ఉంటుంది
  • తక్కువ ఎత్తులోనూ సమర్థంగా పనిచేయగలదు
  • 280kmph గరిష్ఠ ఎత్తులోప్రయాణించే వేగం

అందుబాటులో 16 యాంటి-ట్యాంక్‌ ఏజీఎం-114 హెల్‌ఫైర్‌, స్ట్రింగర్‌ మిస్సైల్స్‌, హైడ్రా-70 అన్‌గైడెడ్‌ మిస్సైల్స్‌

శత్రువులపై బుల్లెట్ల దాడి కోసం 1,200 రౌండ్ల సామర్థ్యంతో 30-ఎంఎం చైన్‌ గన్‌. నిమిషానికి 600-650 రౌండ్లు ఫైర్‌ చేయవచ్చు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్