Monday, October 14, 2024

కిడ్నీ రాకెట్ పై గురి

- Advertisement -

కిడ్నీ రాకెట్ పై గురి

Aim for the kidney rocket :

విజయవాడ, జూలై 10
బెజవాడ, గుంటూరు కేంద్రంగా సాగుతోన్న ఈ కిడ్నీ దందా ఇప్పుడు ఏపీలో సంచలనం రేపుతోంది. ఇడ్లీలు అమ్మినంత ఈజీగా కిడ్నీలు కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్లను టార్గెట్‌గా చేసుకొని వల విసురుతోంది కిడ్నీ మాఫియా. ఒక్క కిడ్నీ ఇస్తే చాలు లైఫ్‌ సెటిలైపోద్ది అంటూ ఎరవేయడంతో నమ్మి మోసపోతున్నారు బాధితులు. కిడ్నీ గ్యాంగ్‌ కోసం వేట మొదలైంది. బాధితుడు మధుబాబు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో యాక్షన్‌లోకి దిగారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని కిడ్నీ దందా వెనుకున్న బ్రోకర్లు బాషా, వెంకట్‌ కోసం గాలింపు ప్రారంభించారు. మొత్తం నాలుగు బృందాలతో ఆపరేషన్‌ స్టార్‌ చేశారు గుంటూరు పోలీసులు. ఇప్పటికే వెంకట్ సుబ్రమణ్యంలను గుర్తించారు పోలీసులు. బాషా కోసం గాలింపు ముమ్మరం చేశారు. నిందితుడు విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. విజయవాడలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ జరిగిన విజయ ఆస్పత్రికి ఈరోజు వెళ్లి వివరాలు సేకరించనున్నారు. గతంలోనూ విజయవాడ-గుంటూరు కేంద్రంగా కిడ్నీ మాఫియా అరాచకాలు బయటపడటంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు పోలీసులు.ఈ రాకెట్‌ వెనుక ఎవరెవరి ఇన్వాల్‌మెంట్‌ ఉందో తేల్చే పనిలో పడ్డారు. హోంమంత్రి అనిత సైతం కిడ్నీ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే కిడ్నీ బాధితుడు మధుబాబుకు మెరుగైన వైద్యం కోసం జిజిహెచ్‎కు తరలించిన పోలీసులు. గార్లపాటి మధుబాబుకు పెళ్లైంది ఇద్దరు పిల్లలున్నారు. ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పరచుకుని కిడ్నీ అమ్మకంపై మాయ మాటలు చెప్పారు. డబ్బుల కోసం నిందితుడిని నిలువునా దోచేశారు. ముప్పై లక్షలు ఇస్తామని ఆశచూపి మోసం చేశారు. రికార్డులు తారుమారు చేశారు. జూన్ 15న విజయవాడలోని విజయా సూపర్ స్పెషాటిలీ ఆసుపత్రిలో కిడ్నీ ఆపరేషన్ చేశారు. అంతా అయిపోయాక లక్షా పదివేల రూపాయలు మాత్రమే చేతిలో పెట్టారు. బాధితుడు మధుబాబు మిగిలిన డబ్బులు ఇవ్వాలంటూ.. మధ్యవర్తి వెంకట్‎ను అడగటం మొదలు పెట్టాడు. అయితే రక్త సంబంధీకుడుగానే కిడ్ని ఇచ్చావని నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ బాధితుడితో వెంకట్ ఎదురు తిరిగాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న మధుబాబు రెండు రోజుల క్రితం గుంటూరు ఎస్పీని ఆశ్రయించారు. ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్