Sunday, September 8, 2024

అయ్యా బాంచన్ దొర బతుకులు పోవాలి: విజయశాంతి

- Advertisement -

కెసిఆర్ మోడీ ఇద్దరు ప్రజలను మోసం చేస్తున్నారు

బిజెపి బిఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలు

కేసీఆర్ మోడీ మధ్య రహస్య ఒప్పందం

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే

మంథని విజయభేరి సభలో విజయశాంతి

మంథని: పదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు అయ్యా బాంచన్ దొర అనే విధంగా బతకాల్సి వచ్చిందని అలాంటి పార్టీని గద్దధించే అవకాశం ప్రజలకు వచ్చిందని,పేదల బతుకు మార్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని  కాంగ్రెస్ పార్టీ క్యాంపియన్ కమిటీ చీప్ కో-ఆర్డినేటర్ విజయశాంతి అన్నారు.  మంగళవారం మంథనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విజయభేరి బహిరంగ సభలో విజయశాంతి పాల్గొని మాట్లాడారు. పోయిన ఎలక్షన్లో వచ్చి శ్రీధర్ బాబును గెలిపించాలని కోరానని, మళ్లీ మీ ఆశీర్వాదంతో శ్రీధర్ బాబు గెలుపు కోసం వచ్చానని శ్రీధర్ బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె అభ్యర్థించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ కు ర్చీపై కూర్చునే అర్హత లేదన్నారు.నీ 10 సంవత్సరాల పరిపాలన ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా అని ఆమె ప్రశ్నించారు.కెసిఆర్ ప్రభుత్వ  కాలంలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని, అయ్యా కేసీఆర్ భాంచన్ దొర ఈ 10 ఏళ్ల తమరి పరిపాలనలో దోపిడీ, హత్యలు,హింస, అరెస్టులు,ప్రజల చావులు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.

కేసీఆర్ నీ టైం అయిపోయింది.. మంచి రోజులు వచ్చే సమయం ఆసన్నమైందని, నీ ప్రభుత్వ హాయంలో ఇసుక మాఫియాతో పాటు అనేక అవినీతి, అక్రమాలు జరిగాయన్నారు. బీసీలకు సీట్లు ఇవ్వని బిజెపి సీఎం బీసీలను చేస్తున్నదని ఆమె విమర్శించారు.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆరు గారంటీలను అమలు చేసి తీరుతామని ఆమె తెలిపారు. వామన్ రావు దంపతులను నడిరోడ్డుపై నరికి చంపడం దారుణం అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రైతులు విద్యార్థులు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రైతుల పంట పొలాలు నీటి మునిగిపోయాయని కాలేశ్వరం ప్రాజెక్టు అధికంగా దోపిడీకి గోవింద్ అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో లక్షల కోట్ల దోపిడీ జరిగిందన్నారు. తెలంగాణలో ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకు వెళ్లాలంటే భయపడవలసి వస్తుందన్నారు.ఈ ప్రభుత్వ హాయంలో మహిళలకు విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఏ ఒక్క వర్గ ప్రజలు సంతోషంగా లేరని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నామన్నారు.మీ పతనం ఖాయమైందని, కెసిఆర్ కొడుకు,కూతురు భయoదోనలలో ఉన్నారన్నారు.బిజెపి బిఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలని,ప్రజలు వాటిని నమ్మే స్థితిలో లేరన్నారు.

aiya-banchan-dora-should-live-vijayashanti
aiya-banchan-dora-should-live-vijayashanti

2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారని, కెసిఆర్ తో మోడీ అమిత్ షా నడ్డా చేతులు కలపాలని వారు ఉద్యమకారులను మోసం చేశారని ఆమె ప్రశ్నించారు కవిత ఉన్నప్పటికీ ఆమెపై నరేంద్ర మోడీ,నడ్డా, అమిత్ షా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అవినీతికి వ్యతిరేకంగా వారు ఎందుకు నోరు మోదపడం లేదని ఆమె ప్రశ్నించారు.కెసిఆర్ను రెండుసార్లు గెలిపిస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు.కేసీఆర్ మోడీ మధ్య రహస్య ఒప్పందం ఉందన్నారు. అందుకే కేసిఆర్ కూతురు కవిత లిక్కర్ స్కాంలో కేంద్రం అరెస్టు చేయకుండా వెనుకడుగు వేసిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందన్నారు. సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రాన్ని బహుమతిగా ఇవ్వాలని కేసీఆర్ను దించి కాంగ్రెస్ ను కెసిఆర్ గెలిస్తే తెలంగాణ చస్తది మీరు గెలిస్తే తెలంగాణ బతుకుతుంది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ చేయి పట్టుకుందని ఆమె నిరుద్యోగులను మోసం చేశావు, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, ప్రకృతి కూడా మీకు సహకరించడం లేదు, కేసీఆర్ పతనం మొదలైందన్నారు.ప్రజలు కోరుతున్న విధంగా పాలనను అందించే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ వైఫల్యలపై ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు దిగుతూ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తూ ప్రజలను ఇబ్బందిలకు గురిచేస్తున్నారన్నారు. మేనిఫెస్టో ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలతో పాటు వివిధ పథకాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తుందని,ఈ ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శ్రీధర్ బాబును భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.

మంథని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం…ఎమ్మెల్యే శ్రీధర్ బాబు..

మంథని నియోజకవర్గoలో విద్య వైద్య తోపాటు అన్ని రంగాల్లో రాబోయే రోజుల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు విజయభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మంత్ర నియోజకవర్గంలో అనేక విద్యాలయాలు స్థాపించి చదువుకోవడానికి అవకాశం కల్పించామని రాబోయే రోజుల్లో మరింత పెద్దపీట వేస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీ, వ్యవసాయ డిగ్రీ కాలేజీ, నర్సింగ్ కాలేజీ,ఏర్పాటు చేస్తామన్నారు.విద్యుత్ కష్టాలు తీర్చింది కాంగ్రెస్ పార్టీయోనని,2009లో తొమ్మిది గంటల ప్రీ కరెంటు  ఇచ్చామని, అనేక విద్యుత్ ప్లాంట్లు పెట్టమన్నారు.24 గంటల విద్యుత్ ఇచ్చే సదుపాయం కల్పించింది కాంగ్రెస్ పార్టీయో అని ఆయన అన్నారు.మంథని ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపితే చంపుతామంటూ దాడులు చేస్తున్నారని, రౌడీయిజం, గుండాయిజం చేస్తున్నారన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ముంపుకు గురవుతున్న వారికి పంట నష్టం ఇప్పిస్తామని, కరకట్టలు నిర్మిస్తామన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను వెంటనే ప్రజలకు అందజేస్తామన్నారు.

ఈ బహిరంగ సభలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతో పాటు రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్