యాదాద్రి కొండపైన పర్యటించిన ప్రభుత్వ విప్ అలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

- Advertisement -

యాదాద్రి కొండపైన పర్యటించిన ప్రభుత్వ విప్ అలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

భువనగిరి (వాయిస్ టుడే ప్రతినిధి):- యదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శనివారం రోజు ఉదయం దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ఆవరణలో పర్యటించారు. కొండపైన భక్తులకు కావాల్సిన మౌలిక సౌకర్యాలల్లో ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిసి కొండపైన పర్యటించి పలు విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ పర్యటన లో గత ప్రభుత్వం యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ పనులు చేపట్టగా అవి ఒక ప్రణాళిక ప్రకారం లేవన్నారు. దీని ధ్వారా భక్తులు ఇబ్బందులకు గురిఅవుతున్నారని,ప్రధానంగా భక్తులు స్వామి వారికి కొబ్బరికాయలు కొట్టాలి అంటే కొబ్బరికాయలు కొట్టే స్థలం లేదన్నారు. ఈ సందర్భంగా కొబ్బరి కాయలు కొట్టడానికి స్థలం ఏర్పాటు చేయాలని,మెట్ల దారిలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా షెడ్డు ఏర్పాటు చేయాలని,అదేవిధంగా మూత్రశాలాలను పెంచి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని,త్రాగు నీటి సమస్య పరిష్కారం చేయాలని,అదేవిధంగా భక్తులు నిద్రచేయడం కోసం డార్మానెంట్ హల్ కోసం స్థలం పరిశీలించారు. దీంతో పాటు పుష్కరిణిలో నీరు ఉండేలా చూడాలని తెలిపారు. ముఖ్యంగా శానిటేషన్ పనులు సరిగ్గా చేయాలని పరిశీలిన లో అధికారులును ఆదేశించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular