అల్ఫోర్స్ ఇ-టెక్నో విద్యార్థులకు ఇండోర్ నేపాల్ కరాటే చాంపియన్షిప్ లో బంగారు పతకాలు
కరీంనగర్
క్రీడలలో కరాటేకు ప్రత్యేకత ఉన్నదని, అంతర్జాతీయ ఖ్యాతి పొందిన క్రీడగా పిలువబడినదని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు ఇండో నేపాల్ కరాటే చాంపియన్షిప్లో కరాటేలో బంగారు పతకాలు రావడం పట్ల ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సభకు ఆయన బ్ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విశ్వ క్రీడ అయిన కరాటేలో ఎన్నో విషయాలు నేర్చుకునేవి ఉంటాయని ప్రత్యేకంగా ఆత్మవిశ్వాసం, పోరాట పటిమను పెంపొందించే విధానాలను తెలుసుకుంటామని చెప్పారు. కరాటేలో చాలా రకాల విభాగాలు ఉంటాయని ప్రతి ఒక్కదానికి ప్రత్యేకత ఉన్నదని గుర్తు చేశారు. నేటి కాలంలో మహిళలు కూడా వారి ఆత్మరక్షణకై కరాటే నేర్చుకోవడమే కాకుండా వాటిలోని విభాగాలను తెలుసుకొని పట్టు సాధించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నారని తెలిపారు. ప్రపంచంలో చాలా మంది కరాటేను ఇష్టపడతారని ఆ రంగంలో రాణించడానికై ప్రత్యేక శిక్షణ తీసుకుంటారని అభివర్ణించారు.
ప్రాథమికంగా విద్యార్థులకు పాఠశాలలో ఎంపిక పరీక్ష నిర్వహిస్తామని అందులో ప్రతిభ కనబరచిన వారికి పోటీలకు ఎంపిక చేస్తామని వారు చెప్పారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డా॥బి. ఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఫిట్ ఇండియా లక్ష్యసాధనలో భాగంగా గోజు రోజు కరాటే అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడినటువంటి ఇండో నేపాల్ కరాటే చాంపియన్షిప్లో పాఠశాలకు చెందినటువంటి ఓ. వంశవర్ధన్, 8వ తరగతి అండర్ 12 బాలుర విభాగంలో వెపన్లో బంగారు పతకం, కటాలో కాంస పతకం, ప్రణవి గౌతమ్, 3వ తరగతి అండర్ 12 బాలికల విభాగంలో వెపన్లో రజతం కటాలో కాంస్యం , సుధీక్ష్య, 7వ తరగతి అండర్ 12 బాలికల విభాగంలో కటాలో రజతం, కుమిటేలో రజత పతకాలు సాధించడం చాలా గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు. విజేతలకు పుష్ప గుచ్చాలతో పాటు ప్రశంస పత్రాలను అందజేసి రాబోయే రోజుల్లో మరిన్ని టోర్నమెంట్లలో పాల్గొని అంతర్జాతీయ ఖ్యాతిని కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయబృందం, విద్యార్థులు పాల్గొన్నారు.