ఉత్సాహాన్ని నింపిన అల్ఫోర్స్ హోళి కేళి
Alfors Holi celebrations filled with excitement
కరీంనగర్ మార్చ్ 13
హోళి రంగుల పండుగా పిలువడం జరుగుతుందని జీవితాల్లో వెలుగులు నింపే పండగని తద్వారా సమాజంలో ఆనందం వాత్సల్యం వెల్లివిరిస్తూందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥వి.నరేందర్ రెడ్డి స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీటాట్స్ ప్రాంగణంలో వేడుకగా నిర్వహించినటువంటి అల్ఫోర్స్ హోళి కేలీ కి ముఖ్య అతిధిగా హాజరై వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిఒక్కరు సుఖసంతోషాలతో వారి జీవనాన్ని కొనసాగించాలని ఆర్థికంగా సుభిక్షంగా ఉండాలని తెలుపుతూ ప్రతిఒక్కరు జీవితాన్ని ఇతరులకు ఆదర్శప్రాయంగా కొనసాగించాలని వారు కోరారు. నేడు చాలా మంది పలు కారణాల వలన మానవ బంధాలకు దూరమవు తున్నారని ప్రేమా వాత్సల్యం తరిగిపోతుందని విచారం వ్యక్తం చేస్తూ ప్రతిఒక్కరు సోదర భావంతో మెదిలి ఇతరులకు మేలు చేయడమే లక్ష్యంగా ముందుకు కొనసాగాలని వారు చెప్పారు. రంగుల రంగుల జీవితాలలో ఎల్లప్పుడు సుఖసంతోషాలతో వర్దిలాలనే ఉద్దేశంతో హోళి పండుగగకు ముందు రోజు కామదహన కార్యక్రమాన్ని వీధులలోని ప్రధాన కూడళ్ళలో కామదహన కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహిస్తారని చెప్పారు. ప్రతిఒక్కరు పండుగల ప్రాశ్చస్యాన్ని విధిగా గుర్తుంచుకోవాలని వాటి విశిష్ఠతను ఇతరులకు తెలియజేయాలని చెప్పారు. సమాజంలో వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాల గుణాలతో ఉంటారని చెడు గుణాలను వదులుకునేటట్లుగా ప్రోత్సాహకాలను అందిచాలని చెప్పారు. ఈ పండుగను అత్యంత ఆనందోత్సవాల మధ్య ప్రపంచం వ్యాప్తంగా ఘనంగా విభిన్నంగా నిర్వహించుకుంటారని సహజసిద్ధమైన రంగులతో హోళీని నిర్వహించుకోవాలని అభిప్రాయపడుతూ మత సామరస్యానికి విలువైన ప్రతీకగా ఉంటుందని చెపారు. హోళీ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు పలు సాంస్కృతిక కార్యక్రమాలను అట్టహాసంగా ఆకాశమే హద్దుగా అన్నట్టు నిర్వహించడం జరిగినదని చెప్పారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి హోళి హమారా రంగోలి, హోళి హోతే హే హమారే విశ్వమే, చూడమ్మ రంగుల పండుగ హోళి పండుగ, హోళి కావాలి మనకు సిరుల పండుగ నృత్యాలు చాలా ఆకర్షింపచేసాయి. ఈ వేడుకలలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.