- Advertisement -
గణేష్ ఉత్సవాలకు అన్నీ ఏర్పాట్లు
All Arrangements for Ganesh Utsavam
మేడ్చల్
గ్రేటర్ హైదరాబాద్ లో జరిగే వినాయక నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఈ రోజు నగరంలోని అన్ని జొన్లలో పర్యటించి ఆయా ప్రాంతాల్లోని చెరువుల వద్ద జరుగుతున్న వినాయక నిమర్జన ఏర్పాట్ల పనులను పరిశీలించినట్లు మేయర్ తెలిపారు. అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు చేస్తున్న ఏర్పాట్లకు స్థానిక ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సహా వివిధ శాఖల అధికారులు, కార్పొరేటర్లు రాజ్ జితేందర్ నాథ్, చింతల విజయశాంతి పాల్గొన్నారు.
- Advertisement -



