- Advertisement -
గ్రూప్ 2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
All arrangements for Group 2 exams are complete
సిద్దిపేట
టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి తెలిపారు.
టిజిపీఎస్సీ నిబంధనల మేరకు ఈనెల 15 మరియు 16 తేదీలలో జిల్లాలో టిజిపిఎస్సి గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 13714 మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షకు హాజరుకానున్నారని ఇందుకు సిద్దిపేట పట్టణంలో మొత్తం 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పరీక్ష నిర్వహణకు 39 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 37 మంది చీఫ్ సూపరింటిండెంట్లు,04 గురు రూట్ అధికారులు, 12 మంది ప్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్లును, 576 మంది ఇన్విజిలెటర్లు,101 మంది బయో మెట్రిక్ ఇన్విజిలెటర్లను నియమించామన్నారు. అభ్యర్థుల సౌకర్యార్తం అన్ని పరీక్ష కేంద్రాలలో త్రాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, విద్యుత్ సౌకర్యాలు కల్పించామని, అభ్యర్థులు సమయానికి పరిక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టిసి బస్ లను నడిపేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, పరిక్షా కేంద్రాలకు 3 కిలోమీటర్ల లోపు 144 సెక్షన్ విధించడం జరుగుతుందని, జిరాక్స్ కేంద్రాలను ముసివేయడం జరుగుతుందని అన్నారు.
15 వ తేదీ ఆదివారం నాడు ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1 పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి ఉదయం 8:30 గంటలనుండి 9:30 గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని అన్నారు.
అలాగే 2వ పేపర్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పరీక్ష నిర్వహణ ఉంటుందని అభ్యర్థులను మధ్యాహ్నం 1:30 గంటల నుండి 2:30 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందని అన్నారు.
16వ తేదీ సోమవారం 3వ పేపర్ ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని అభ్యర్థులను ఉదయం 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందని అన్నారు.
అలాగే 4 వ పేపర్ 16 వ తేది నాడు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్ష నిర్వహణ ఉంటుందని అభ్యర్థులను మధ్యాహ్నం 1:30 గంటల నుండి 2:30 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందని అభ్యర్థులు నిర్ణిత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. సెల్ ఫోన్లు, వాచీలు తదితర ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం కుదరదు కాబట్టి అభ్యర్థులు ఎవరు ఎలక్ట్రానిక్ వస్తువులను వెంట తీసుకురావద్దని సూచించారు.
- Advertisement -