సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులంతా గెలిచి తీరాలి

- Advertisement -

సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులంతా గెలిచి తీరాలి

All candidates of the Kutami should win in the elections of irrigation societies

టిడిపి సీనియర్ నాయకులు మంచూరు సూర్యనారాయణ రెడ్డి

బద్వేలు,

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగురోజుల్లో డిసెంబర్14వ తేదీన జరగబోతున్న సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులంతా గెలిచి తీరాలని బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. దాదాపు 10 సంవత్సరాల విరామం తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో అన్నిచోట్ల గెలవడం ద్వారా ప్రభుత్వం బలం చాటాలని ఆయన సూచించారు. బద్వేల్ పట్టణంలోని మంచూరునివాసంలో ఎన్నికలకు సంబంధించి  అట్లూరు మండలం, బద్వేల్ మండల నాయకులతో ఆయన  సమావేశమై ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. సాగునీటి సంఘాల్లో సభ్యులుగా ఎవరు పోటీ చేయాలి, అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయమై కార్యకర్తలు, నాయకులతో చర్చించారు. మరీముఖ్యంగా కూటమి శ్రేణుల భాగస్వామ్యం ఉండేలా సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. సమయం తక్కువగా ఉన్నందున అందరూ కలిసికట్టుగా ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని సూచించారు. ఎన్నికల్లో రైతుల సంక్షేమం కోసం పాటుపడే వారిని గెలిపించుకోవాలని ఆ దిశగా శ్రేణులంతా పార్టీ నిర్ణయం మాజీ శాసనసభ్యులు విజయమ్మ, నియోజకవర్గ సమన్వయకర్త యువ నాయకుడు రితీష్ రెడ్డి, ఆదేశాల మేరకు ముందుకు సాగాలని మంచూరు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular