అర్హులందరు ఓటు నమోదు చేసుకోవాలి.
All eligible should be registered to vote.
జయశంకర్ భూపాలపల్లి,
నవంబర్ 29.
జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని భూపాలపల్లి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఆర్డిఓ మంగిలాల్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డా బిఆర్ అంబేడ్కర్ క్రీడా మైదానంలో ఎన్నికల సంగం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో యువతీ, యువకులకు ఓటు హక్కు నమోదుపై స్వీప్ లో భాగంగా 2 కే రన్ నిర్వహించారు. క్రీడా మైదానం నుండి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు చేపట్టిన 2 కే రన్ కార్యక్రమాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి, ఆర్డిఓ మంగిలాల్ మాట్లాడుతూ నూతన ఓటరు నమోదు, చిరునామా మార్పు, పోలింగ్ కేంద్రం మార్పు, మరణించిన వ్యక్తుల ఓటు హక్కు తొలగింపు చర్యలకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించినట్లు వివరించారు.
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, ఓటరు జాభితా, ఓటరు గుర్తింపు కార్డులో గుర్తించిన వ్యత్యాసాలు తొలగింపు, ఓటరు జాబితాలో నాణ్యతలేనట్లు గుర్తించిన ఫోటోలకు బదులుగా నాణ్యత గల ఫోటోలు అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని అన్నారు.
1.1.2025వ తేదీని ఎన్నికల సంగం ప్రామాణికంగా తీసుకుని నూతన ఓటరు నమోదు, ఓటరు జాభితాలో మార్పులు, చేర్పులు, పోలింగ్ కేంద్రం మార్పు, మరణించిన వ్యక్తుల ఓటు హక్కు తొలగింపు కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన
పేర్కొన్నారు. 29.10.2024 నుండి 28.11.2024 వరకు స్వీకరించిన అబ్యంతరాలు అబ్యంతరాలను 24.12.2024వ తేదీ వరకు పరిష్కరించి 1.1.2025వ తేదీన ఎన్నికల సంగం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తుందని, 6.1.2025 తేదీన తుది ఓటరు జాభితా ప్రకటించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
అనంతరం ఓటు హక్కు నమోదుతో పాటు ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ నరేష్, డిపిఆర్వో శ్రీనివాస్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకన్న, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, డిటీలు అబ్బాస్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.