మాజీమంత్రులందరూ వచ్చి అన్నా క్యాంటీన్లో భోజనం చేయండి
All ex-ministers come and have lunch in Anna’s canteen
-ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం
అన్నా క్యాంటీన్లపై విమర్శలు చేస్తున్న మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు అంబటి రాంబాబు ఒకసారి అన్నా కాంటీన్ కి వచ్చి భోజనం చేయాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లపై చౌకబారు విమర్శలు చేయొద్దని ఆయన హితవు పలికారు. తాడేపల్లిగూడెం లోని తాలూకా ఆఫీస్ సెంటర్, బలుసులమ్మ గుడి, కాపు కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2014లో తాను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత మూడు అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేసే అదృష్టం దక్కిందని గత ప్రభుత్వం పేదవాడి భోజనాన్ని దూరం చేసిన సందర్భంలో మరోసారి పునః ప్రారంభం చేసే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని మూడు అన్నా క్యాంటీన్లలో 1050 మంది ప్రజలకు అల్పాహారంతో పాటు మధ్యాహ్నం సాయంత్రం భోజనం కూడా అందించేందుకు అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఒక పూట క్యాంటీన్ కయ్యే 10,500 రూపాయలను ఆయన మున్సిపల్ కమిషనర్ కు అందించారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో వేడుకలు పుట్టినరోజు వేడుకలకు సందర్భంగా పదివేల 500 రూపాయలు మున్సిపల్ కమిషనర్ లేదా జిల్లా కలెక్టర్ పేరున డిడి తీస్తే వారి పేరుపై అన్నా క్యాంటీన్లో ఒక పూట పేదవారికి భోజనం అందుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం నుంచి తొలిసారిగా మొదలు పెడుతున్నామని ఈ కార్యక్రమం రాష్ట్రానికి రోల్ మోడల్ కావాలని కూడా ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వలవల బాబ్జి తదితరులు పాల్గొన్నారు.



