జగన్ వైపే… అందరి చూపు
కనీసం సపోర్ట్ చేయని కేడర్
విజయవాడ, మార్చి 31, (వాయిస్ టుడే )
All eyes are on Jagan...
వైసీపీలో అంతర్గత ప్రజాస్వామ్యం మాత్రమే కాదు.. ఐక్యత కూడా కరువేనా అంటే ఔననే సమాధానమే వస్తోంది..కారణమేంటని చూస్తే అందరి చూపు జగన్ వేపే.. ఒక కాకికి దెబ్బ తగిలితే వంద కాకులు వచ్చి మూగుతాయ్. అవి మూగ జీవాలైనా ఐకమత్యంలో టాప్ ప్లేస్ లో నిలుస్తాయి. అలాంటి కాకి ఫార్ములా మన పార్టీ లో లేదు ఏం చేద్దాం.. ప్చ్.. అంటూ తెగ ఫీలవుతున్నారట.. ఫ్యాను పార్టీ లీడర్లు.చిన్నా చితకా.. సాదా సీదా.. చోటా మోటా లీడర్ల ఆవేదన అయితే పర్లేదనుకోవచ్చు. కానీ, పార్టీలో ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం.. కేసులు, అరెస్టులు, జైళ్ల పాలై సతమతమవుతున్న వారు.. తీవ్ర నిరాశా నిస్పృహలు వ్యక్తం చేస్తున్నారట. అధికారంలో ఉన్నపుడు కాదు లేనప్పుడు.. అందరం ఒక్కటే అన్న ఐక్యతారాగం ఆలపించాలి. కానీ ఇక్కడ జరుగుతున్నదేంటి? నాపేరు బికారీ నా దారి ఎడారీ అన్న ఆరున్నొక్క రాగాలు ఆలపించాల్సి వస్తోందని వీరు వాపోతున్నారట.అధికారంలో ఉన్నపుడు.. తెగ హగ్గులూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్న ఈ లీడర్లు.. ఇప్పుడు ఎడమొహం పెడమొహం పెట్టుకోవడం మాత్రమే కాదు.. ఒకరికొకరు అసలు గుర్తు పట్టనట్టే వ్యవహరిస్తున్నారట. అప్పట్లో ఒళ్లంతా నోరు చేసుకుని.. ప్రతిదానికీ రియాక్టయిన కొడాలి వంటి వారు కూడా.. ఇప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నారట. ఊద్యోగం ఊడింది. ఉన్నా లేనట్టే ఉందాం అన్న ధోరణిలోకి జారుకుంటున్నారటఎంత మాత్రం కంట్రోల్లో లేదట. ఇలా నోరున్నోళ్లు కూడా భయపడి.. మౌన ముద్రలోకి వెళ్తుంటే.. ఇక సాదాసీదా లీడర్ల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోందట. అది నీతో అవినీతో. కష్టమో నష్టమో.. మన వాళ్లకంటూ ఒక దెబ్బ తగిలితే.. దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. అలా జరిగి ఉండదన్న కామెంట్లు చేయాలి. కానీ గతంలో క్లోజ్ గా మూవ్ అయిన వారు కూడా ఇప్పుడు అంటీ ముట్టనట్టు వ్యవరిస్తున్నారట.ప్రస్తుతం అందరిలోకీ.. విడదల రజనీ వ్యవహారమైతే అత్యంత దారుణంగానే ఉందట. ఎంత మాత్రం ఆశాజనకంగా లేదట. అది ఆమె స్వయంకృతాపరాధమే కావచ్చు. కానీ ఒకే పార్టీలో ఉన్నాం. ఆ మాత్రం ఒకరికొకరం కోపరేట్ చేసుకోకుంటే ఎలా? ఇలాగేనా పార్టీలో బిహేవ్ చేసేదంటూ.. ఏకంగా ఆమె అనుచరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కొందరైతే.. విజయసాయిరెడ్డి ఇందుకేగా పార్టీ పదవులు, సభ్యత్వం వదిలి వెళ్లిపోయిందంటూ.. ఆయన ఉదంతాన్ని ఉదహరిస్తున్నారట.ఏంటీ ఒంటరి పోరాటాలు.. మాకు మేము పోరాడుకోడానికేనా పార్టీలో చేరిందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరలాంటప్పుడు మేం పార్టీలో ఉంటే ఏంటి లేకుంటే, ఏంటి? అని వీరు తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కుతున్నారటమొన్న కాకాని వ్యవహారంలో కూడా ఇలాగే జరిగిందనీ చెప్పుకొస్తున్నారట. మాజీ మంత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదైతే.. జిల్లాలో ఒక్క నాయకుడు కూడా రియాక్ట్ కాలేదు. పార్టీలో ఒకరిపట్ల మరొకరికి ఎంత సఖ్యత ఉందో దీన్నిబట్టీ చెప్పొచ్చంటున్నారట.ఇది ఒక విడదల రజనీ, కాకాని గోవర్ధన రెడ్డి వంటి ఒకరిద్దరి వ్యవహారం కాదనీ.. బోరుగడ్డ అనిల్ కావచ్చు, నందిగం సురేష్ కావచ్చు.. పార్టీ కోసం అంతగా గొంతు చించుకుని పని చేసిన వారికి మిగిలిందేంటి? అరెస్టులు, కేసులు, జైలు పాలు కావడం తప్ప? అంటూ తీవ్ర ఆవేదనా పూరిత స్వరంతో తమ ఆక్రోశమంతా వెళ్లగక్కుతున్నారట.వంశీ అరెస్టు సమయంలో జగన్ జైలుకు రాలేదా? మరింకేం కావాలంటూ కొందరు వీరిని ప్రశ్నిస్తుంటే.. ఇక్కడే తమకు కాలుతుందోని అంటున్నారట. ఆయనొక్కరు వస్తే సరిపోతుందా? ఒకరి పట్ల మరొకరికి కేరింగ్ ఏదీ? అన్న కోణంలో తీవ్ర నిరాశగా వీరు ఎదురు ప్రశ్నిస్తున్నారటజగన్ తన పార్టీ లీడర్లలో ఒకరి మధ్య మరొకరికి యూనిటీ ఉండేలా.. పార్టీని తయారు చేయలేదని ఎలాంటి భయం బెరుకూ లేకుండానే ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారట. అంతర్గత ప్రజాస్వామ్యం అసలే లేదని బాధ పడుతున్నారట. పార్టీని తీర్చి దిద్దిన విధానంలోనే లోపముందని మాట్లాడుకుంటున్నారట.ఒక వేళ ఎవరైనా యాక్టివ్ లీడర్లు.. పార్టీకి ఏదైనా మేలు చేయాలని ముందుకేస్తే.. వీరిపై క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు చేపడతారన్న భయంతో నిమ్మకుండి పోతున్నారట. దీంతో తమకు ఎందుకొచ్చిన గొడవలెమ్మని చోద్యం చూస్తుండిపోతున్నారట. ఇదంతా అధినేత జగన్ పార్టీని రన్ చేసే పద్ధతిలోని అతి ప్రధాన లోపమనీ.. తాము ఏమీ చేయలేమని వీరిలో వీరు భావిస్తున్నారట.మరి దీనికి పరిష్కారమేంటని అధిష్టానానికి దగ్గరగా ఉన్నవారు వీరిని ప్రశ్నిస్తున్నారట. అధినేత జగన్ జనంలోకి వెళ్లడం కాదు.. ముందు తమతో విస్తృతంగా భేటీ అయ్యి.. మా మనోగతం ఏంటో అడిగి తెలుసుకోవాలని వీరు చెప్పుకొస్తున్నారట. జగన్ మీడియా ముందు ఒకటీ అరా కామెంట్ల ద్వారా కార్యకర్తలను సంతృప్తి పరచలేరనీ వీరు ఖరాకండిగా చెప్పేస్తున్నారట. సింగిల్ లైన్ కామెంట్లతో తమలో ఒక భరోసా రాదనీ వీరు కుండబద్ధలు కొడుతున్నారట. ఎప్పుడైతే అధినేత నుంచి ఒక ఇన్ స్పిరేషన్ దొరుకుతుందో.. ఆటోమేటిగ్గా.. ఒకరిలో మరొకరికి యూనిటీ పెరుగుతుందని వీరు అధినేతకే ఎదురు పాఠాలు చెబుతున్నారట.మొన్నటికి మొన్న విజయసాయిరెడ్డి చేసిన మెయిన్ కంప్లయింట్ ఇదేనని వీరు ఉదహరిస్తున్నారట. జగన్ చుట్టూ ఒక కోటరీ ఏర్పడిందనీ.. దీంతో సామాన్య కార్యకర్త నుంచి విడుదల రజనీ వంటి నేతల వరకూ కూడా వీరు అడ్డుగోడల్లా నిలుస్తున్నారనీ.. దీంతో పార్టీలో అనైక్యత నానాటికీ పెరిగిపోతుందని వీరు అంటున్నారట. దీంతో ఎవరికి వారే- ఎమునా తీరే అన్న చందంగా తయారైందనీ కామెంట్ చేస్తున్నారట. జగన్ కూడా మమ అనిపించేస్తూ.. నెట్టుకొస్తున్నారనీ.. ఈ మూడు ముక్కలాటతో తమలో యూనిటీ వచ్చే పరిస్థితే లేదని వీరు తెగేసి చెబుతున్నారట.గతంలో టీడీపీ లీడర్లు అరెస్టయినపుడు.. కేసులు ఎదుర్కున్నపుడు.. ఆ పార్టీలోని ఎందరో లీడర్లు ముందుకొచ్చేవారు. దర్నాలు, నిరసనలు నిర్వహించేవారు. వైసీపీకి ఎదురు తిరిగి అందరూ కలసి ఏకతాటిపై నిలిచేవారు. ఫలితంగా పార్టీ బలం ఎపాటిదో అప్పట్లో అందరికీ తెలిసేది. అంతే కాదు పార్టీలో, ఐక్యత ఎంత మేరకు ఉందో స్పష్టమయ్యేది కావాలంటే గతం తరచి చూసుకోమంటున్నారట.ప్రస్తుతం వైసీపీలో విడుదల రజనీ, కాకాని గోవర్ధన్ రెడ్డి, వల్లభనేని వంశీ విషయంలో.. వారికి వారు చేసుకుంటున్న ఒంటరి పోరాటం తప్పించి.. తమ వెంట పార్టీ ఉందన్న భరోసా ఎంత మాత్రం కనిపించడం లేదని వాపోతున్నారట. మరిప్పుడేం చేయాలి? అంటే అందరి చూపు అధినేత జగన్ వైపే మళ్లుతోందట. మరి చూడాలి అధినేత జగన్.. దేవుడు, ప్రజలే నా బలం అని మాత్రమే కాకుండా.. నాయకులు, కార్యకర్తలే నా సైన్యమన్న ధోరణిలోకి ఎప్పుడస్తే అప్పుడే పార్టీ తిరిగి పూర్వవైభం సాధిస్తుందన్న కామెంట్లు చేస్తున్నారట. జగనన్నకొకసారి బలగం సినిమా చూపించాలి. కాకి ఫార్ములా తెలియచేయాలన్న సెటైర్లు విసురుతున్నారట.