Wednesday, January 15, 2025

చేనేత రంగం అభివృద్ధికి అన్ని విధాల కృషి

- Advertisement -

చేనేతలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం వారి అభివృద్ధికి కట్టుబడి ఉంది:
జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
చేనేత రంగం అభివృద్ధికి అన్ని విధాల కృషి:
ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణ
తిరుపతి,

All kinds of efforts for the development of handloom sector

చేనేత రంగాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.బుధవారం ఉదయం 10 వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వెంకటగిరి పట్టణంలోని కూడలి నందు ప్రగడ కోటయ్య భారతీయ చేనేత శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం పద్మశాలీల కళ్యాణ మండపంలో నిర్వహించిన సభలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ భారతదేశంలో చేనేతల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. గౌ. ముఖ్యమంత్రి చేనేత రంగాన్ని ముందుకు తీసుకు పోవాలని కట్టుబడి ఉన్నారని, అందుకే నేడు చీరాల నందు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా కార్యక్రమంలో మధ్యాహ్నం పాల్గొంటున్నారని తెలిపారు. దేశంలో వ్యవసాయ రంగం మొదటి స్థానంలో చేనేత రంగం రెండవ స్థానంలో ఉందని వివరించారు.  వర్షాకాలం సమయంలో మగ్గం గుంటలో నీరు చేరడం వల్ల చేనేతలు ఇబ్బందులు  పడుతున్నట్లు దృష్టికి వచ్చిందన్నారు.. ఈ మేరకు చేనేతలు ఉన్న కాలనీలో రోడ్లు, సైడ్ కాలవలు  నిర్మాణానికి అధికారులతో చర్చిస్తామని వివరించారు.. గతంలో చేనేతలకు అందించే రాయితీలపై బ్యాంకర్ల తో మాట్లాడి త్వరలో చర్యలు తీసుకుంటామని వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక భారతీయ చేనేత శిక్షణ కేంద్రం అభివృద్ధికి కూడా చర్యలు చేపడతామన్నారు.. మారుతున్న కాలానుగుణంగా చేనేతలో ఆధునికతను చేరువచేసి, చేనేత రంగం అభివృద్ధి అయ్యేలా  చర్యలు తీసుకుంటామని తెలిపారు… వెంకటగిరిలో టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటు చేస్తామని వివరించారు.. కొత్త పెన్షన్లు మంజూరుకు , సబ్సిడీలు రావడం కోసం సంబందిత శాఖలతో చర్చించి వాటిని ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గౌ. శాసనసభ్యులు  టిడ్కో ఇళ్ళపై  సమస్యలు తెలిపారని వీటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చూపుతామని తెలిపారు. అదేవిధంగా హ్యాండ్ లూం టెక్నాలజీ సెంటర్  నందు అడ్మిషన్లు పెంచే విధంగా మరింత అభివృద్ధి పరిచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని రంగాలలో ప్రాచీన పద్దతులలో తయారు చేసేవాటికి ప్రస్తుతం డిమాండ్ అధికంగా ఉందని  ప్రజల, వినియోగదారుల  అభిరుచులకు తగినట్లు తయారుచేయగలిగితే డిమాండ్ అధికంగా పెరుగుతుందని తెలిపారు. తిరుపతి జిల్లాలో పరిశ్రమలకు ఎక్కువ అవకాశం కలదని  చేనేతలకు ఉన్న సమస్యలు తీర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు గతంలో చేనేత అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు.. వారంలో ఒకరోజు చేనేత దుస్తులు ధరించి వారికి అండగా నిలిచారని, నేడు అదే విధంగా ధరించేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళతామన్నారు. కేవలం చేనేత వర్గానికి కాకుండా ఉపకుల వృత్తులు వారికి కూడా ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. భారతీయ చేనేత శిక్షణా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం వల్ల మరిన్ని నిధులు వస్తాయని తద్వారా అభివృద్ధి చెందుతుందని వివరించారు.ఈ క్రమంలో పలువురు చేనేతలను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్స్ శాఖ అధికారి పిచ్చేశ్వర్ రావు, మునిసిపల్ చైర్మన్ భాను ప్రియ మాస్టర్ వీవర్స్, పలువురు చేనేత కార్మికులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్