సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

All people should be vigilant about cyber crimes

సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయకూడదు
విద్యార్థులకు సూచన..

వ్యక్తిగత సమాచారం చోరీ చేయడం ఆర్థిక నష్టాలు కలిగించటం వంటి ఘటనలు విరివిగా జరుగుతున్నాయి

సోషల్ మీడియా పై ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

మంగళగిరి రూరల్ సీఐ వై శ్రీనివాసరావు

మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్

సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంగళగిరి రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ విజ్ఞప్తి చేశారు. గురువారం
మంగళగిరి మండలం కురగల్లు  గ్రామంలోని అమృత యూనివర్సిటీ లో  సైబర్ క్రైమ్ ఫై అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు. మంగళగిరి రూరల్ సీఐ వై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ ఫై అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా మంగళగిరి రూరల్ సీఐ వై శ్రీనివాసరావు, ఎస్సై చిరుమామిళ్ల వెంకట్  విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు పట్ల విద్యార్థులు అధ్యాపకులు అందరూ జాగ్రత్త వహించి మోసాల బారిన పడవద్దు అని సూచించారు. ఈ నేరాలు జరుగుతున్న పద్ధతులపై విద్యార్థులకు ఆయన ఉద్భోదించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత సమాచారం తో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. బ్యాంక్ ఆన్లైన్ మోసాలు సోషల్ మీడియా వచ్చే ఫోన్ కాల్స్ లింకులు పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, రూరల్ సీఐ శ్రీనివాసరావు ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్  కోరారు.వారు విద్యార్థిని, విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో అమృత యూనివర్సిటీ విద్యార్థినీ, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular