గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వెల్ లో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వము ఏర్పడిన రెండు రోజుల్లోనే 6 గ్యారంటీలలో రెండు గ్యారెంటీలను నెరవేర్చాం. రవాణా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాం. తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షలు ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంపొందించాము అన్ని హాస్పిటల్లో అమలు అవుతుందని అన్నారు.
ఇచ్చిన అన్ని హామీలను వంద రోజుల్లో నెరవేరుస్తాం. కొంతమంది మాజీ మంత్రులు ఈ ప్రభుత్వాన్ని నడవనీయమంటున్నారు. రైతులకు పెట్టుబడి సహాయాన్ని గత ప్రభుత్వం ఏ మాదిరిగా ఇచ్చిందో అదే మాదిరిగా మేము ఇస్తాం. ఈ గజ్వేల్ నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన ఏనాడు ప్రజలను కలిసేవాడు కాదని అన్నారు.