Monday, October 14, 2024

ఎంపి బండికి శుభాకాంక్షలు

- Advertisement -

ఎంపి బండికి శుభాకాంక్షలు
కరీంనగర్
కరీంనగర్ డిసిసి కార్యాలయం లో మంత్రి పొన్నంప ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు ఎమ్మేల్యేలు- అది శ్రీనివాస్ కవ్వంపల్లి సత్యనారాయణ- కరీంనగర్ పార్లమెంట్

అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు తదితరులు పాల్గోన్నారు.
మంత్రి పొన్నం మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఫలితాల పై యావత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా  సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం.. కరీంనగర్ లోక్ సభ నుండి

ప్రతి ఒక్కరం ఇండియా కూటమి నాయకత్వానికి ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే , సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి సభ్యులకు హృదయ పూర్వక

అభినందనలు తెలుపుతున్నాం. దేశ వ్యాప్తంగా ఉన్న చానెల్స్ అన్ని ఇండియా కూటమి కి సీట్లు రావని ఎగ్జీట్ పోల్స్ ఇచ్చాయి..! అందరి అంచనాలు తల కింధులు చేస్తూ బీజేపీ  ముఖ్యమంత్రులను అరెస్టు చేసిన

ఈడిలను ఉపయోగించుకొని మొత్తం ప్రతిపక్షాలను గొంతు నొక్కే ప్రయత్నంచేసి  భయబ్రాంతులకు గురి చేసిన ప్రజాస్వామ్యం బతకాలని ఇండియా కూటమి సభ్యులను ఇంత పెద్ద ఎత్తున గెలిపించిన వారికి ప్రజాస్వామ్యం

పట్ల వారికున్న ప్రేమ స్పష్టం అవుతోంది.
తెలంగాణ లో కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో ఎమ్మెల్యే గా  గణేష్ 10 వేల పైచిలుకు మెజారిటీ తో గెలవడం 5 నెలల రేవంత్ రెడ్డికి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రశంస గా భావిస్తున్నాం. గణేష్

గెలుపుకు హృదయపూర్వక  శుభాకాంక్షలు.కరీంనగర్ లోక్ సభ లో రాజేందర్ రావు గెలుపు కోసం ఎమ్మేల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు, మండల అధ్యక్షులు,బూత్ ఇంచార్జి లు, కార్యకర్తలు అభ్యర్థి గెలుపు కోసం

కృషి చేసారు..
మూడు దఫాలుగా ముఖ్యమంత్రి  పర్యటనకు హుజురాబాద్ కి ఒకసారి,సిరిసిల్ల సభ కి రాహుల్ గాంధీ నామినేషన్ ఉన్న కారణంగా ముఖ్యమంత్రి  ఆలస్యంగా రావడం, వర్షం వల్ల సభ రద్దయింది. రాహుల్ గాంధీ  ఇతర

కార్యక్రమాల వల్ల రాకపోయినా కార్యకర్తల కృషితో రాజేందర్ రావు 3 లక్షల 54 వేల పై చిలుకు ఓట్లు రావడం కార్యకర్తల కృషి .గతంలో ఎంపిగా చేసిన ఆయన లక్ష ఓట్లు కోల్పోయి మూడవ స్థానానికి పరిమితం

అయ్యారు.బీజేపీ గెలిచిన అభ్యర్థి మతపరమైన విద్వేషాలు మాని ప్రజా సమస్యల పై దృష్టి సారించాలి.నరేంద్ర మోడీ ప్రభావం తమిళనాడు లో పని చేయలేదు. పనిచేసిన దగ్గర ఇలాంటి మెజారిటీ వచ్చింది.ప్రజల

ఆకాంక్షలకు అనుగుణంగా గెలిచిన ఎంపి మతపరమైన అంశాలకు, విద్వేషాలను కరీంనగర్ పరిమితం కావద్దని అభివృద్ధి పరిమితం కావాలని  గెలిచిన ఎంపి కి మా అందరి తరుపుతున్న శుభాకాంక్షలు

చెబుతున్న..ఉమ్మడి జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలుగా గెలిచాం, కరీంనగర్ లోక్ సభ నుండి నలుగురు ఎమ్మెల్యేలం గెలిచాం.రాబోయే కాలంలో ఈ లోక్ సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ కంచుకోట

గా చేసుకుంటాం.కాంగ్రెస్ కార్యకర్తలు అధర్య పడవద్దు,కాంగ్రెస్ పార్టీ నైతిక గెలుపు,కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పిన ముగ్గురు  ఎమ్మేల్యేలు, ఇద్దరూ మాజీ  మంత్రులు దగ్గర కూడా వారికి మెజారిటీ రాని పరిస్థితి.బిఆర్ఎస్ ఓట్లు

అడగని పరిస్థితి.మీ అందరి కష్టం తో 3 లక్షల 54 వేల ఓట్లు సాధించాం,భవిష్యత్ లో మండలాలు, మున్సిపాలిటీ లు, వార్డు మెంబర్లు కూడా కాంగ్రెస్ గెలుచుకుంటుందని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్