Monday, December 23, 2024

చేతగాని సీఎం రేవంత్ వల్లే ఇదంతా…

- Advertisement -

చేతగాని సీఎం రేవంత్ వల్లే ఇదంతా…

All this is because of useless CM Revanth

హైదరాబాద్
తొమ్మిదిన్నర నెలలుగా అసమర్థుడి జీవనయాత్ర లాగా రేవంత్ ప్రభుత్వం కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం అయన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు.  అక్కడ అయన మీడియాతో మాట్లాడారు. వంద  రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, రెండు లక్షలు రుణమాఫీ అని చెప్పి,రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి అన్ని వర్గాలను మోసం చేసిండు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి స్వయంగ ఎమ్మెల్యేల ఇంటికి చేరి కాళ్లు పట్టుకొని మరి కండువాలు కప్పుతాడు. పది మంది ఎమ్మెల్యేలు పోయారు ఇంకా వస్తారు అని కాంగ్రెస్ మంత్రులు నుండి ఎమ్మెల్యేల వరకు మాట్లాడుతారు హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్ లో భయం మొదలైందని అన్నారు.
ఫిరాయింపులపై స్పీకర్ ని కలిసి సుప్రీంకోర్టు తీర్పలను సైతం ఉటంకిస్తూ పిర్యాదు చేసినం. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి మీద డిస్ క్వాలిఫై పిటిషన్ వేసిందే కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ తరపున హైకోర్టు జస్టిస్ కి కృతజ్ఞతలు చెబుతున్న. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపడి చావు డప్పులు కొట్టండి అని మాట్లాడి0దే రేవంత్ రెడ్డి. హైకోర్టు తీర్పు వచ్చిన రోజు అరికెపుడి గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమిస్తూ ప్రకటన చేశారు.ప్రజాస్వామ్య విలువలు తుంగలో తొక్కుతూ ఎలా చేస్తారు అని ప్రశ్నిస్తే పోలీసుల అండతో ఎమ్మెల్యే ఇంటి మీద దాడికి దిగారు.ఈ రకమైన గుండాగిరి పదేళ్లలో ఎప్పుడు లేదు.ఫ్యాక్షన్ సినిమాలు తలపించేలా వచ్చారు.శాతగాని ముఖ్యమంత్రి వల్లనే ఇదంతా జరుగుతుంది. రేపు జరగరానిది జరిగితే ఎవరు భాద్యత వహిస్తారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడో తెలియదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పటికైన చెప్పాలి ఏ పార్టీలో ఉన్నారో. గ్యారెంటీలు అమలు చేయాలని అడిగితే ఇలాంటి హైడ్రామాలు చేస్తున్నారు. నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులను చూశాం. పైశాచిక ఆనందం కోసమే ఇదంతా రేవంత్ చేస్తున్నాడు. ఇవన్నీ తిరిగి రేవంత్ కి తిరిగి చుట్టుకుంటాయి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. దాడి జరిగినప్పుడు ఇక్కడ విధుల్లో విఫలం అయిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిజిపి ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి అర్థరాత్రి వరకు తిప్పితే తెలంగాణ ప్రజలు మొత్తం మా వెంట నిలిచారు.ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే తెలంగాణ ప్రజల పౌరుషం చాటారు. నిన్న మముల్ని హౌజ్ అరెస్ట్ చేసి గాంధీని రక్షణ కల్పించారు. గాంధీని హౌజ్ అరెస్ట్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావు కాదు. హైదరాబాద్ లో పదేళ్లలో శాంతి భద్రతలు అద్భుతంగా మెయింటైన్ చేసామని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న ప్రజలు అందరు మా వారే. ప్రాంతీయతత్వం మీద దాడులు గతంలో లేవు ఇప్పుడు ఉండవు. బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ ప్రజలు అండగా నిలిచారని రేవంత్ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. కాంగ్రెస్ లో ఎందుకు చేరినవ్ దిక్కుమాలిన పీఏసీ పదవి కోసం ఇలాంటి మాటలు మాట్లాడిన గాంధీకి సిగ్గుండాలి. ఒక్కసారి నియోజకవర్గ ప్రజలను అడిగితే గాంధీ ఏపార్టీలో ఉన్నాడో చెబుతారని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్