దత్తత తీసుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.. చివరికి
దత్తత తీసుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.. చివరికి
శ్రీకాకుళం జిల్లా కొత్తవలస మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీతంపేటకు చెందిన శ్రీను, పద్మ దంపతులకు పిల్లలు లేరు. దాంతో కొన్నేళ్ల క్రితం సంధ్య (19) అనే యువతిని దత్తత తీసుకున్నారు. కంచరపాలెంలోని ఐటీఐ కళాశాలలో పాలిటెక్నిక్ పూర్తి చేసింది. క్యాంపస్ సెలక్షన్‌లో సంధ్య ఉద్యోగం కూడా సాధించింది. ప్రయోజకురాలైన కూతురు తమను చూసుకుంటుందని దంపతులు భావించారు. అయితే కొన్ని రోజుల క్రితం సంధ్య అనారోగ్యానికి గురైంది. దాంతో ఇంటి వద్దే ఉంటుంది. బంధువులు ఇంటికి దంపతులు వెళ్లడంతో.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సంధ్య ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి.. సంధ్య మృతికి గల కారణాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.