- Advertisement -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుల పై ఆరోపణలు
Allegations against Chief Minister Revanth Reddy's brothers
19 ఏకరాలకు ఏసరు పెట్టారు
గత 40 సంవత్సరాలుగా మల్కాజిగిరి లో 398, 399, 409, 410, 411/1, 411/2, 579 మొత్తంగా 19 ఎకరాల 18 గుంటలలో ఉన్న ఇండ్లను అక్రమంగా పోలీసులను పెట్టి మరి కూల్చి వేయించడం దాని చుట్టూ ఫెన్సింగ్ నిర్మించడం చూస్తుంటే రాష్ట్రంలో పరిస్థితులు దిగజారినట్టు గుర్తు చేస్తున్నాయని రాకేష్ రెడ్డి అన్నారు. ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండుసార్లు పనిచేసిన సీనియర్ నాయకులైన తమ నాన్న సూర్యనారాయణ రెడ్డి కూడా బాధితుడుగా మారడం, కోర్టు ఉత్తర్వులు కూడా పోలీసులు పాటించకపోవడం, పోలీసులు తమ విధులను నిర్వర్తించకుండా ప్రైవేటు సైన్యంగా మారడంని చూస్తే కచ్చితంగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఆయన ఆరోపించారు. రాచకొండ కమిషనర్ సైతం ఈ అక్రమార్కులకు వంత పాడడం ఏంటి అని ప్రశ్నించారు. పోలీస్ ఉన్నతాధికారులను కలిసినప్పుడు గత ఎన్నికలలో మీరు బి.ఆర్.ఎస్. లో ఉన్నారట కదా అంటూ సిఎం రేవంత్ రెడ్డి సోదరులను కలవాల్సిందిగా వారు చెప్పారని వాపోయారు… గత 40 సంవత్సరాలుగా మేము పోజిషన్ లో ఉన్నామని, కోర్టు ఉత్తర్వులు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు… కానీ కోర్టు ఆర్డర్లు ధిక్కరిస్తూ పోలీస్ ల సమక్షంలో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటం చూస్తుంటే సిగ్గుగా ఉందని వారు వాపోయారు… సిఎం రేవంత్ రెడ్డి కలుగజేసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు వాపోయారు…
- Advertisement -