హైదరాబాద్, నవంబర్ 1, (వాయిస్ టుడే): తాపై కసరత్తు చేస్తున్నాయి. అయితే.. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పొత్తుల అంశం ప్రాసెస్ లో ఉందన్నారు. కాంగ్రెస్ తుది జాబితా ప్రకటించే వరకు వేచి చూస్తామని ఆయన వెల్లడించారు.అంతేకకాఉండా.. ఆ తర్వాత మా నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించకపోయినా మేం పాటిస్తామని కూనంనేని వ్యాఖ్యానించారు. మేం ఏం చేయాలో మాకు స్పష్టత ఉందని, రేపు మరోసారి మా పార్టీ ముఖ్య నేతలు సమావేశం అవుతారన్నారు. సీపీఎం వైఖరిపై తామేమీ నిర్ణయం తీసుకోలేదని, కాంగ్రెస్ తో అవగాహనలో భాగంగా సీపీఐకి రెండు స్థానాలు ఇస్తామని తెలిపిందన్నారు. మార్పులు చేర్పులు ఉంటే తరువాత ఆలోచన చేస్తామని, కాంగ్రెస్ లో నేతలను ఎందుకు చేర్చుకున్నారో నాకు తెలియదని కూనంనేని సాంబశివ రావు తెలిపారు. కాంగ్రెస్ మాట నిలబెట్టుకుంటుందని అనుకుంటున్నామన్నారు కూనంనేని సాంబశివ రావు వ్యాఖ్యానించారు.