Monday, December 23, 2024

ఎత్తులు- పొత్తులు ఎవరికి మోదం..ఎవరికి ఖేదం

- Advertisement -
Altitudes- alliances
For whom love..for whom regret

విజయవాడ, ఫిబ్రవరి 8,
టీడీపీ – బీజేపీ మధ్య మళ్లీ పొత్తు పొడవనుందా? తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్‌ ఢిల్లీ టూర్ వెనుక అసలు టార్గెట్ పొత్తులేనా? ఏపీలో పొత్తులపై సమదూరం పాటించాలనే ఆలోచనకొచ్చిన బీజేపీ మనసు మారిందా..? గతంలో నాలుగు సార్లు పొత్తు పెట్టుకొని విడిపోయిన బీజేపీ, టీడీపీ మళ్లీ జట్టు కడితే.. ఏపీలో రాజకీయంగా ఏం ఉండనుంది?ఓ జాతీయ పార్టీతో అధికారికంగా.. మరో జాతీయ పార్టీతో అనధికారికంగా టీడీపీ పొత్తు కుంటుందంటూ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానమిస్తూ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు వెనుక ఉద్దేశమేంటి? అంటే టీడీపీ, బీజేపీ పొత్తుపై సీఎం జగన్‌కు కూడా సంకేతాలు ఉన్నట్లేనా? అసెంబ్లీ ఎన్నికల వేళ తాజా రాజకీయ పరిణామాలు.. టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీ ఎంట్రీ ఎవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పొత్తుల వ్యవహారంపై ఇన్‌డెప్త్ అనాలసిస్..
పొత్తు వెనుక పరమార్థం!
1. టీడీపీ, చంద్రబాబుతో ఇన్నాళ్లుగా ఉన్న రాజకీయ వైరానికి తెర
2. బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలన్న జనసేన నేత పవన్ కల్యాణ్ ప్రయత్నాల ఫలితం
3. పొత్తు కోసం పోరాడుతున్న బీజేపీ నేతలు పురందేశ్వరి, సుజనాచౌదరి, సీఎం రమేష్ వంటి వారికి ఊపు
4. ఎన్నికలు ఫెయిర్‌గా జరిగే ఛాన్స్!
పొత్తు కుదిరితే ప్రయోజనాలు
1. దేశ వ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగా ఉన్న ‘ఫీల్ గుడ్ ఫ్యాక్టర్’
2. పోల్ మేనేజ్మెంట్‌లో వైసీపీని ధీటుగా ఎదుర్కోగల నైతిక బలం
3. బీజేపీ మద్దతుతో రాష్ట్రాభివృద్ధికి నిర్మాణాత్మక కృషి చేయగలమన్న భరోసా
4. జగన్‌ను ఏకాకిని చేయగలిగామన్న సంతృప్తి
-పొత్తు కుదిరితే కొత్త చిక్కులు
1. పరిస్థితులకు అనుగుణంగా చంద్రబాబు ప్లేట్ ఫిరాయిస్తారన్న వైసీపీ వాదనకు బలం
2. మైనారిటీలు ఎలా స్పందిస్తారనే అంశం
3. జనసేన, బీజేపీ నుంచి భవిష్యత్‌లో ఎదురయ్యే ఒత్తిడి
4. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై బీజేపీపై ఉన్న విమర్శలకు సమాధానం చెప్పాల్సిరావడం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్