ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. గద్దర్ మృతి చెందినట్లు ఆయన కుమారుడు సూర్యం తెలిపారు. ఇవాళ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గద్దర్ తుదిశ్వాస విడిచారు
గద్దర్ మెదక్ జిల్లా లోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో దళిత కుటుంబంలో జన్మించాడు. విద్యాభ్యాసం నిజామాబాదు జిల్లాలో,మహబూబ్ నగర్ లో, ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్ లో జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఆతర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వారు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట “ఆపర రిక్షా” రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.

అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో …
హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి : ప్రజా గాయకుడు గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ రావు (74) ఇకలేరు. అనారోగ్యంతో ఆయన ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో గద్దర్‌ను పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఇంతలోనే ఆయన కన్నుమూయడం బాధాకరం. ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్ పీపుల్స్ వార్, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్లాది మంది ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు.
అమర్ రహే గద్దరన్న.. నీ పాట అజరామరం.. నీ పాట ప్రజా చైతన్యం.. ప్రజా యుద్ధ నౌకవై తెలంగాణ అస్తిత్వ పోరాటానికి వెన్నెముకగా నిలిచిన నీ పాట.. ఎప్పటికీ మా చెవుల్లో మారు మ్రోగుతూనే ఉంటుంది.. తెలంగాణ కోసం సబ్బండ వర్ణాలను ఏకం చేసిన నీ పాట, నీ ఆట మరువలేము.. తెలంగాణ గుండె చప్పుడు అయిన నీ గుండె ఆగినా మా గుండెల్లో పాటవై మ్రోగుతూనే ఉంటావు.. జోహార్ గద్దరన్న
… జర్నలిస్ట్ శంకర్ స్టాఫ్ రిపోర్టర్ పెద్దపెల్లి


