27.7 C
New York
Thursday, June 13, 2024

అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సక్సెస్ మీట్ లో మూవీ టీమ్సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

- Advertisement -

అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాపై మేము పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టారు – సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

ఈ ఇయర్ బిగినింగ్ లోనే టాలీవుడ్ కు మరో సూపర్ హిట్ ఇచ్చింది “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా. సుహాస్, శివాని నాగరం జంటగా నటించిన ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు దుశ్యంత్ కటికినేని రూపొందించారు. శరణ్య ప్రదీప్, నితిన్ కీ రోల్స్ చేశారు. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తున్న “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
యాక్టర్ త్రినాథ్ మాట్లాడుతూ – ఈ సినిమాలో ఎర్రన్న అనే మంచి క్యారెక్టర్ చేశాను. నాకే కాదు ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులకు చాలా బలమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇదంతా మా డైరెక్టర్ దుశ్యంత్ గారి ప్రతిభే అని చెప్పాలి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు మరింత పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటి దివ్య మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” కొన్ని రోజులకు గుర్తుండిపోయే సినిమా కాదు కొన్ని ఏళ్లు గుర్తుండే మూవీ. ఈ సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చారు డైరెక్టర్ దుశ్యంత్ గారు. మూవీ చేస్తున్నప్పుడు శివాని, సుహాస్ ఎంతో సపోర్ట్ చేసి ఫ్రెండ్లీగా ఉన్నారు. థియేటర్ లో శివాని, సుహాస్, నితిన్ పర్ ఫార్మెన్స్ లకు ఆడియెన్స్ బాగా రెస్పాండ్ అవుతున్నారు. టీమ్ అందరికీ నా కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.
ఎడిటర్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ – ఇలాంటి మంచి మూవీలో నన్ను పార్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతున్నా. మా ఎడిటింగ్ రూమ్ బన్నీవాస్ గారు, సందీప్ గారు వీళ్లతో కళకళలాడుతూ ఉండేది. సుహాస్ తో పనిచేయడం లక్కీగా భావిస్తున్నా. శివాని ఈ మూవీతో స్టార్ అయ్యింది. నాతో పాటు పనిచేసిన టెక్నికల్ టీమ్ అందరికీ ఆర్టిస్టులు అందరికీ కంగ్రాట్స్. అన్నారు.
సినిమాటోగ్రాఫర్ వాజిద్ బేగ్ మాట్లాడుతూ – ఇది నా డెబ్యూ మూవీ. నన్ను నమ్మి సినిమాటోగ్రాఫర్ గా ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్, ధీరజ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాకు పనిచేసిన వాళ్లంతా ఒక టీమ్ గా వర్క్ చేశారు. సుహాస్ బ్రదర్ నాకు ఎప్పటికీ ఒక ఇన్సిపిరేషన్ గా నిలిచిపోతాడు. అన్నారు.
యాక్టర్ నితిన్ మాట్లాడుతూ – తమిళం, మలయాళంలో వస్తున్న మంచి కంటెంట్ మూవీస్ తెలుగులోనూ రావాలని అనుకునేవారి కోరికను “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” తీర్చిందని అనుకుంటున్నా. థియేటర్స్ విజిటింగ్ చేస్తున్నప్పుడు హాల్స్ లో ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది. సుహాస్ హీరోను కాదు మంచి యాక్టర్ ను అని ప్రూవ్ చేసుకున్నారు. శివాని, శరణ్య క్యారెక్టర్స్ కథలో హై తీసుకొచ్చాయి. అన్నారు.
హీరోయిన్ శివాని మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” తో హిట్ అందుకున్న మా ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి కంగ్రాట్స్. ఆయన ఇలాంటి మరెన్నో సక్సెస్ లు అందుకోవాలి. అమ్మా నాన్న తర్వాత నేను రుణపడి ఉండేది మా డైరెక్టర్ దుశ్యంత్ గారికే. ఆయన నన్ను హిట్ సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేశారు. సుహాస్ వల్లే ఇవాళ ఇలాంటి మంచి సినిమా వచ్చింది. సుహాస్ కు సక్సెస్ కంటిన్యూ కావాలి. లీడ్ పెయిర్ కే కాదు మిగతా ఆర్టిస్టులందరికీ మంచి పేరొచ్చింది. మా సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.
డైరెక్టర్ దుశ్యంత్ మాట్లాడుతూ – ఇలాంటి కథలు రాయడంతోనే సరిపోదు ప్రొడ్యూస్ చేసే ధైర్యం గల వాళ్లు కావాలి. గీతా ఆర్ట్స్, ధీరజ్ గారు, బన్నీ వాస్ గారు ఆ  ధైర్యం చేశారు. ప్రొడ్యూసర్స్ తో పాటు కథను నమ్మిన హీరో సుహాస్ కు థ్యాంక్స్. సినిమా చూసిన వాళ్లంతా ప్రతి సీన్ గురించి మాట్లాడుతున్నారు. హీరో హీరోయిన్ బ్రేకప్ సీన్, పోలీస్ స్టేషన్ సీన్..ఇలా ప్రతి ఒక్కటీ గుర్తుపెట్టుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులు చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు. విలన్ ను ఎందుకు చంపలేదు అంటూ. ఇది అహంకారానికి, ఆత్మాభిమానికి మధ్య జరిగే కథ.  ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు అని ఈ మూవీలో చెప్పాం. సిస్టర్స్ ఉన్న ఆడియెన్స్ అయితే ఎమోషనల్ అవుతున్నారు. మా సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. సుహాస్, శివాని, నితిన్, శరణ్య తో పాటు మేకింగ్ లో సపోర్ట్ గా ఉన్న టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ –  “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా ఒప్పుకునే టైమ్ కు నేను కో ప్రొడ్యూస్ చేసిన డీజే టిల్లు, బేబి మూవీస్ హిట్ అయ్యాయి. అంత పెద్ద సినిమాలు చేసిన నువ్వు ఈ సినిమా ఎందుకు చేస్తున్నావు అని కొందరు అడిగారు. అవి వేరే జానర్ మూవీస్..ఈ సినిమా జానర్ వేరు అని చెప్పా. నా దృష్టిలో “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఒక జెన్యూన్ మూవీ. ఈ కథ విన్నప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగింది. కొందరు స్టార్ హీరోను తీసుకో అని చెప్పినా..నేను సుహాస్ అయితేనే ఈ కథకు కరెక్ట్ అని నమ్మాను. చాలా మంది కొత్త వాళ్లకు మేము ఒక ప్లాట్ ఫామ్ ఇచ్చామనే సంతృప్తి ఏర్పడింది. నాతో పాటు సుహాస్, డైరెక్టర్ దుశ్యంత్ ఈ సినిమాపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టారు. వాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షో వేసి..చూసిన ఆడియెన్స్ తో మా మూవీ టీమ్ కు ఇంటరాక్షన్స్ చేయిస్తున్నాం. మాకు సపోర్ట్ గా ఉన్న డైరెక్టర్ సాయి రాజేశ్ కు థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ సినిమా ద్వారా ఫలానా కులాన్ని కించపరిచారనే కాంట్రవర్సీ జరగకూడదని స్క్రిప్ట్ నుంచి ఫస్ట్ కాపీ వరకు ప్రతి సందర్భంలో జాగ్రత్తలు తీసుకున్నాం.  అన్నారు.
హీరో సుహాస్ మాట్లాడుతూ – నాకు హ్యాట్రిక్ ఇచ్చిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. నన్ను నమ్మి థియేటర్స్ కు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. సినిమా రిలీజ్ ముందే నేను, ధీరజ్ గారు అనుకున్నాం ఈ సినిమాతో హిట్ కొడుతున్నామని. ఇవాళ ఆ మాట నిజమైనందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో హీరోతో పాటు మిగతా క్యారెక్టర్స్ కు ఇంపార్టెన్స్ ఉంది. అదే ఈ స్క్రిప్ట్ లో ఉన్న స్ట్రెంత్. మిగతా వారు బాగా పర్ ఫార్మ్ చేసినా సినిమా హిట్టైన పేరు హీరోకే పేరొస్తుంది. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”కు పనిచేసిన ప్రతి ఒక టీమ్ మెంబర్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అనురాగ్, శరత్ ..వీళ్లిద్దరు నా లైఫ్ లో మర్చిపోలేని వ్యక్తులు. తేజ కాకుమాను మా గురువు. నేను ఎదగాలని ఎప్పుడూ కోరుకునే వ్యక్తి. నా యాక్టింగ్ కు ఇంత మంచి పేరు వచ్చిందంటే కారణం తేజ కాకుమాను. మూడు రోజుల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా. రేపటి నుంచి టూర్స్ వస్తున్నాం. మీ అందరినీ కలుస్తాం. అన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!