జేఆర్ సీ కన్వెన్షన్ హాలుకు అమిత్ షా
హైదరాబాద్, జూలై 27, (వాయిస్ టుడే): బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఎల్లుండి శనివారం అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3:45 గంటలకు ప్రత్యేక విమానంలో అమిత్ షా హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు జేఆర్‌సీ కన్వెన్షన్‌లో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, సామాజిక సంఘాల నాయకులతో భేటీ అవుతారు. తర్వాత సాయంత్రం 5:15 గంటలకు శంషాబాద్‌లోని నోవాటెల్‌కు వస్తారు. 5:15 నుంచి 8 గంటల వరకు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు.అనంతరం రాత్రి తిరిగి ఢిల్లీ వెళ్తారు. ఇదిలా ఉండగా అమిత్‌షా పర్యటన సందర్భంగా ఈనెల 29న ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ ప్లాన్ చేస్తోంది. కేంద్ర మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.