అమిత్ షా కీలక ప్రకటన.. లడఖ్‌లో కొత్తగా ఐదు కొత్త జిల్లాలు.
Amit Shah's key announcement.. Five new districts in Ladakh.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు తెలిపారు. వాటిని జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్తాంగ్ జిల్లాలుగా తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రభుత్వ ఫలాలు ప్రతి ఒక్కరి ఇంటివద్దకు చేకూరేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అమిత్ షా ట్వీట్ చేశారు.
అభివృద్ధి చెందిన, సుసంపన్నమైన లడఖ్‌ను నిర్మించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత ఈ నిర్ణయానికి కారణమని షా తన ట్వీట్ లో వెల్లడించారు. లడఖ్ ప్రజలకు సమృద్ధిగా అవకాశాలను కల్పించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
కాగా లడఖ్‌లో ప్రస్తుతం రెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయి అవి లేహ్, కార్గిల్.. తాజాగా మరో ఐదు జిల్లాల ఏర్పాటుతో మొత్తం ఏడు కానున్నాయి. త్వరలో జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమిత్ షా ప్రకటన చర్చనీయాంశంగా మారింది.



