రుణమాఫీ మంటలు
హైదరాబాద్, ఏప్రిల్ 24
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగు నెలల్లో 5 గ్యారంటీలను అమలు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్ లో ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు. పంద్రాగస్టులోపు రైతురుణ మాఫీ చేస్తామని తెలిపారు. తాను బాధ్యత తీసుకున్న రోజు రూ. 3900 కోట్ల లోటు బడ్జెట్ ఉందని 5 నెలల్లో రూ. 26 వేల కోట్లు అప్పు కట్టానని స్పష్టం చేశారు. ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉంటే ఆదుకున్నామని తెలిపారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా అని సీఎం రేవంత్ రెడ్డి హరీశ్ రావుకు సవాల్ విసిరారు. సేవాలాల్ సాక్షిగా పంద్రాగస్టు లోగా రూ.2లక్షలు రుణమాఫీ చేస్తాం.. రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని హరీష్ మాట్లాడుతుండని మండిపడ్ారు పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే నీ పార్టీని రద్దు చేసుకుంటావా? ఈ సవాల్ కు హరీష్ సిద్ధమా..? అని ప్రశ్నించారు. నేను మాట ఇస్తే ఎలా ఉంటుందో పోయి మీ మామను అడుగు అని సవాల్ చేశారు. అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను ఎందుకు ఓడించాలో ప్రజల వద్ద వంద కారణాలు ఉన్నాయి. రైతు రుణమాఫీపై మాట తప్పినందుకు, రైతు భరోసాపై మాట తప్పినందుకు, రూ.500 బోనస్‌పై మాట తప్పినందుకు, ఆసరా పెన్షన్లపై మాట తప్పినందుకు, మహిళలకు రూ.2,500 సాయం అందించనందుకు, కల్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం ఇస్తామని మాట తప్పినందుకు, నిరుద్యోగ భృతిపై మాట తప్పినందుకు.. కాంగ్రెస్‌ను ఓడించాలి. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ఎందుకు చేయలేదు? ‘పంద్రాగస్టులోపు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తవా? రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా?’ అని సీఎం రేవంత్‌కు మాజీమంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. రైతుబంధు ఇవ్వని రేవంత్‌రెడ్డి.. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తారా? అని ఎద్దేవా చేశారు. దేవుళ్లను ఆడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయటం తగదని సీఎంకు హితవు పలికారు. ఆగస్టు 15న రుణమాఫీ చేస్తానని ఎవరి చెవుల్లో పువ్వులు పెడతావని ప్రశ్నించారు. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తానని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యానన్నారు. 33 వేల ఓట్ల మెజార్టీతో తనని గెలిపించారని తాను నామినేషన్ వేశాక ఒక్కసారి కూడా కొడంగల్ రాలేదని తెలిపారు. అయినా కొడంగల్ ప్రజలు తనని గుండెల్లో పెట్టుకుని చూశారని పేర్కొన్నారు. కేసీఆర్‌లా తాను ఫామ్ హౌస్‌కు పరిమితమవ్వలేదని రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాలేదని కానీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి 5 సార్లు వచ్చానని అన్నారు. బీజేపీ- బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. 70 ఏళ్లలో పాలమూరుకు ఎంతో అన్యాయం జరిగందన్నారు. కృష్ణా-వికారాబాద్ రైల్వే లైన్‌లో ఎలాంటి పురోగతి లేదని చెప్పారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే కొడంగల్‌కు 5 వేల కోట్ల రూపాయల నిధుల తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. 4 వేల కోట్ల రూపాయలతో మక్తల్- నారాయణపేట్- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చామని.. దీంతో లక్షా 30 వేల ఎకరాలకు నీటిని ఇస్తామని అన్నారు. కృష్ణా జలాలను అడ్డుకున్నది డీకే అరుణ అని ఫైర్ అయ్యారు.
రుణమాఫీ మంటలు
- Advertisement -
- Advertisement -