వృద్ద వికలాంగురాలిపై ఆత్మాచారం, హత్య
నిందితుడికి దేహశుద్ది చేసిన జనాలు
మదనపల్లె: మద్యం మత్తులో ఓ వృద్ధ వికలాంగురాలి పై అత్యాచారం చేసి హత్య చేసి ఆ పై అక్కడే పడుకొన్న ఓ కసాయికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. మదనపల్లె పట్టణ శివారులోని ఈశ్వరమ్మ కాలనీలో 60 సంవత్సరాల రెడ్డమ్మను కుటుంబ సభ్యులు ఓ గదిలో ఉంచి బాగోగులు చూసుకుంటున్నారు. ఈమె నడవలేదు. బుధవారం రాత్రి రూరల్ మండలం రామాపురంకు చెందిన రవి మద్యం మత్తులో ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారం చేసి, హత్య చేసి అక్కడే పడుకొని నిద్రపోయాడు. రాత్రి ఆమెకు భోజనం తీసుకెళ్లిన కోడలు తలుపు గడియ పెట్టి ఉండటం గమనించి అనుమానం వచ్చి చూడగా ఈ ఘాతుకం బయట పడింది. ఆమె కేకలు వేయడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని, తలుపులు పగులగొట్టి నిందితుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.