- Advertisement -
దుమ్మురేపుతున్న అనసూయ హాట్ కామెంట్స్
Anasuya's hot comments
హైదరాబాద్, ఫిబ్రవరి 4, (వాయిస్ టుడే)
అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఇంటర్వ్యూ అతిపెద్ద చర్చకు దారి తీసింది. శృంగారంతో పాటు పలు విషయాలపై ఆమె స్పందించిన తీరు మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. ఆహారం వలె శృంగారం కూడా ఒక ప్రాథమిక అవసరం. ఒక కుర్రాడు తనకంటే వయసులో పెద్ద మహిళను కోరుకోవడంలో తప్పు లేదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిందిఅనసూయ భరద్వాజ్.. యాటిట్యూడ్ కి బ్రాండ్ అంబాసిడర్. కుండబద్దలు కొట్టినట్లు ఆమె మాట తీరు ఉంటుంది. నీ కోసం నువ్వు బ్రతుకు.. సమాజం ఏమనుకుంటుందో.. డోంట్ కేర్ అనేది అనసూయ ఫిలాసపీ. అనసూయపై సోషల్ మీడియాలో అత్యంత నెగిటివిటీ ఉంది. ఆమెను తరచుగా యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటారు. అనసూయ తనదైన శైలిలో వారికి కౌంటర్స్ ఇస్తుంది. చెప్పాలంటే.. హేటర్స్, తాను ఏం చేయకూడదు అని కోరుకుంటారో.. అనసూయ అదే చేస్తుంది.అనసూయ తాజా ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. కొన్ని క్రేజీ ప్రశ్నలకు అనసూయ మొహమాటం లేకుండా సమాధానం చెప్పింది. యూట్యూబర్ నిఖిల్ కమ్ యాంకర్ నిఖిల్ విజయేంద్రతో అనసూయ చిట్ చాట్ సెషన్ లో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా.. ఇటీవల జరిపిన ఓ సర్వే ప్రకారం 20-25 ఏళ్ల అబ్బాయిలు 35ఏళ్ల ఆంటీలను కోరుకుంటున్నారట. వారిపై క్రష్ పెంచుకుంటున్నారట? దీనిపై మీ అభిప్రాయం ఏమిటని అడగ్గా…అందులో తప్పేముందని అనసూయ అన్నారు. ఫుడ్, షెల్టర్, క్లాత్ ప్రాథమిక అవసరాలు. శృంగారం కూడా ప్రాథమిక అవసరమే అన్నారు. పరోక్షంగా ప్రతి ఒక్కరు తమ కోరికలను తీర్చుకోవాలని, ఈ విషయంలో వయసు అడ్డుకాదని చెప్పింది. ఇక తన డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేసే వాళ్లకు మరోసారి గట్టిగా ఇచ్చి పడేసింది అనసూయ. నేను బికినీ వేసినా, బట్టలు విప్పి తిరిగినా అది నా ఇష్టం. మీరు మనుషులు కాదా? ఇద్దరు పిల్లల తల్లి బికినీ వేసిందని ఆలోచించే వాళ్ళను మీరు తప్పుబట్టాలి, అన్నారు.ఎవడో కోన్ కిస్కా గొట్టం గాడి కోసం మన ఇష్టాలు మార్చుకోవాలా.. అని నేరుగా చెప్పారు. అనసూయ హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నటిగా బిజీగా ఉన్న అనసూయ బుల్లితెరకు దూరమైన సంగతి తెలిసిందే. మరలా ఆమె టీవీ షోల మీద దృష్టి పెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత ఏడాది క్రేజీ బాయ్స్ కిరాక్ గర్ల్స్ పేరుతో ఒక షో స్టార్ మా లో ప్రసారం కాగా.. అనసూయ జడ్జిగా వ్యవహరించింది. పుష్ప 2 మూవీలో అనసూయ నటించిన సంగతి తెలిసిందే.
- Advertisement -