- Advertisement -
ఎల్బీనగర్, వాయిస్ టుడే: దసరా పండుగ సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాదులో అలాయ్–బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాయ్–బలయ్ కార్యక్రమానికి మహేశ్వరం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అందెల శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ఇనుమడింపజేసేందుకు బండారు దత్తాత్రేయ అలాయ్-బలాయ్ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరిలో సోదరభావం పెంపొందుతుందన్నారు.
- Advertisement -



