- Advertisement -
మంత్రి సీతక్కను కలిసిన అంగన్వాడీ టీచర్లు
Anganwadi teachers who met Minister Sitakka
హైదరాబాద్
తమ సమస్యలు పరిష్కరించాలని, టిఆర్ఎస్ హాయాం లో జరిగిన సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను సచివాలయంలో కలిసి అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు విజ్ఞప్తి చేసారు.
అంగన్వాడి సిబ్బందికి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పదవి విరమణ ప్రయోజనాలు, అప్గ్రేడ్ అయిన మినీ అంగన్వాడి కేంద్రాల సిబ్బందిలకు జీతాల పెంపు, సకాలంలో జీతాలు వంటి అంశాలను త్వరలో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్కకు అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు, యూనియన్ నేతలు ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -