Saturday, February 14, 2026

యానిమల్ కు సీక్వెల్ గా యానిమల్ పార్క్

- Advertisement -

యానిమల్ కు సీక్వెల్ గా యానిమల్ పార్క్

Animal Park as a sequel to Animal

రణ్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రానికి సీక్వెల్గా ‘యానిమల్ పార్క్’ ఉంటుందని గతంలోనే ప్రకటించిన మేకర్స్, తాజాగా దానిపై ఓ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సీక్వెల్ షూటింగ్ 2027లో మొదలుపెట్టి, 2028లో సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం ‘యానిమల్’ చిత్రాన్ని జపాన్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 13న ఈ సినిమా అక్కడ రిలీజ్ కానుండడంతో హీరో రణ్బీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జపాన్లోని అభిమానులతో ముచ్చటించిన సందీప్ రెడ్డి, ‘యానిమల్’ సీక్వెల్పై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. సినిమా షూటింగ్కు, విడుదలకు సంబంధించిన స్పష్టమైన ప్రణాళికను వెల్లడించడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ‘యానిమల్’ సాధించిన భారీ విజయంతో సీక్వెల్పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు దర్శకుడే నేరుగా టైమ్లైన్ ప్రకటించడంతో ఈ ప్రాజెక్ట్పై  క్లారిటీ  వచ్చింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్