వైసీపీ సోసియల్ మీడియా వారికన్నా పశువులు నయం

- Advertisement -

వైసీపీ సోసియల్ మీడియా వారికన్నా పశువులు నయం

Animals are better than YCP social media

మహిళల జోలికి వస్తే తాట తీస్తా అన్న ముఖ్యమంత్రి  చంద్రబాబుకు  సంఘీభావం తెలుపుదాం

నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

రాష్ట్రంలో వైసీపీ సోసియల్ మీడియా వారి ఆరాచకాలకు అడ్డు అదుపులేకుండా ఉందని, వారికన్నా పశువులు ఎంతో నయమని, మహిళల జోలికి వస్తే తాట తీస్తా అన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంఘీభావం తెలుపుదామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.

శుక్రవారం నంద్యాల బొమ్మలసత్రంలోని ఎంపీ బైరెడ్డి శబరి ఇంట్లో  విలేకరులతో మాట్లాడుతూ  అధికారం పోయిందన్న అక్కసుతో వైసీపీ నాయకులు, వారి సోసియల్ మీడియా ద్వారా టీడీపీ, జనసేన మహిళలపై అసభ్యకరంగా, మహిళలను కించపరుస్తూ పోస్టింగ్స్ పెట్టడం చాలా భాధేస్తుందని, అసలు వీళ్ళు మనుషులేనా అన్న సందేహం కలుగుతుందన్నారు. రాష్ట్ర హోం మంత్రి అనిత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూతుళ్ళపై కూడా వైసీపీ సోసియల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్ పెట్టడం వారి ఆరాచక నైజం తెలియజేస్తుందని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా కఠినంగా వ్యవహారిస్తూ కేసులు నమోదు చేసి వైసీపీ సోసియల్ మీడియా వారిని జైల్లో పడుతున్నారని, వారిలో మార్పు రాకుంటే ఇంకా కఠినంగా  చర్యలు తీసుకోక తప్పదన్నారు. నంద్యాల జిల్లాలో మహిళల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమె హెచ్చరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular