Thursday, April 2, 2026

 కాంట్రవర్శకి కేరాఫ్ గా అనిరుధ్ రెడ్డి

- Advertisement -

 కాంట్రవర్శకి కేరాఫ్ గా అనిరుధ్ రెడ్డి
మహబూబ్ నగర్,  ఏప్రిల్ 2, (వాయిస్ టుడే )

Anirudh Reddy: The Epitome of Controversy
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేరు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అసెంబ్లీ లోపల, బయట ఆయన చేసే వ్యాఖ్యలు వరుస వివాదాలు సృష్టిస్తున్నాయి. ఒక వివాదం సద్దుమనగక ముందే మరో వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సినిమా స్టైల్ డైలాగులు, విప్ప సారా కావాలంటూ ప్రతిపాదనలు, అక్రమ కట్టడాలపై విమర్శలు అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయా లేక పార్టీకి అస్త్రాలవుతున్నాయా అన్న చర్చ మొదలైంది.సినిమా స్టార్స్‌కి డ్రగ్స్ టెస్ట్ చేయాలన్న అంశంపై అనిరుద్ రెడ్డి తాజా వ్యాఖ్య మరోసారి షేక్ చేస్తోంది. సినీ నటులకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. హీరోల ప్యాంటు జేబులు లెక్కపెట్టే ఫ్యాన్స్ ఉన్న దేశం ఇది. వాళ్లేం చేస్తే తామూ అది చేయాలనుకుంటారు. అందుకే వాళ్ళు అందరికీ ఆదర్శంగా నిలిచేలా డ్రగ్స్ తీసుకోలేదని సర్టిఫికేట్ తెస్తేనే సినిమా రిలీజ్ చేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించాయి. ఇది సినీ నటులను కించపరచడమే.. వారిపై అనుమానాలు కలిగించడమే అంటు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. కేవలం హీరోలే ఎందుకు, రాజకీయ నాయకులకూ ఇలాంటి పరీక్ష పెట్టే ఎన్నికల పోటీకి అనుమతించాలని మంచు విష్ణు కౌంటర్ ఇచ్చినా, అనిరుధ్ మాత్రం వెనక్కి తగ్గలేదు.ఇప్ప సారా తెలంగాణ టెకిలా అంటూ అసెంబ్లీలో ఆయన చెప్పిన మాటలు సభ్యులనే ఆశ్చర్యపరిచాయి. ఇప్ప సారా తాగితే 100 ఏళ్లు బతుకుతారు, ప్రభుత్వమే ఇప్ప సారా తయారీ చేయాలి అంటూ ప్రభుత్వానికి సలహా కూడా ఇచ్చారు. ఇది గిరిజన సంస్కృతికి మద్దతా లేక మద్యం పాలసీపై సెటైరా అర్థం కాక విపక్షాలు బిత్తరపోయాయి. కొందరైతే ప్రభుత్వం మళ్లీ  మధ్యం తయారీ రంగంలోకి దిగాలనుకుంటోంది అందుకే అనిరుద్ రెడ్డి నోటి ద్వారా ఇలాంటి కామెంట్స్ చేయించి ప్రజల స్పందన చెక్ చేస్తోందన్న విమర్శా చేస్తున్నారు. కోనసీమ జిల్లాల కొబ్బరిచెట్లపై తెలంగాణ ప్రజల దిష్టి తగిలి మాడిపోత్తున్నాయన్న పవన్ కల్యాణ్‌పై అనిరుద్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఒకసారి కాదు పదే పదే పవన్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ..”ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే విజయవాడ వెళ్ళిపో” అని చేసిన విమర్శలు సోషల్ మీడియాలో యుద్ధానికి దారితీశాయి. పవన్ ఫ్యాన్స్ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరుపై నొచ్చుకున్నారు. ఓ ఆరు నెలల క్రితం కూడా హైదరాబాద్‌లో బిల్డింగ్ పర్మిషన్లు, మున్సిపల్ అధికారుల అవినీతిపై సొంత ప్రభుత్వంపైనే పరోక్షంగా ఒత్తిడి పెంచుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు పాలనలో పారదర్శకత కోసమా? లేక అసంతృప్తినా? అన్న అనుమానం కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌లో నిబంధనల పర్యవేక్షణ లేదు అవినీతి పెరిగిపోతోందని ఆయన వ్యాఖ్యలు ప్రభుత్వాన్నీ పరోక్షంగా ఇరుకున పెట్టాయి. ఏకంగా సీఎం కార్యాలయంపై వేలెత్తి చూపే అకాశమిచ్చాయి కూడా. ఇలా వరుస కాంట్రవర్శియల్ కామెంట్స్ చేసే అనిరుధ్ రెడ్డిని ప్రభుత్వం ఒక ‘టూల్’లా వాడుకుంటోందా? అనే చర్చా సాగుతోంది. ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు ప్రజల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అనిరుధ్ లాంటి ‘బోల్డ్’నాయకులతో ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తుండవచ్చు. దీనికి  కైట్ ఫ్లయింగ్ అనే పరిభాషకూడా వుంది. రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉందా లేక ప్రతికూలంగా ఉందా తెలుసుకునేందుకు ఇలాంటి  నోటి దురుసు నాయకులను ప్రభుత్వం వాడుకుంటుంది. డ్రగ్స్ కంట్రోల్ లేదా మద్యం పాలసీలో మార్పుల వంటి వివాదాస్పద వ్యాఖ్యలు అందుకు నిదర్శనం అంటున్నారు. రేవంత్ రెడ్డికి అండగా ఉంటూనే, ప్రత్యర్థులపై ఎదురుదాడికి అనిరుధ్ రెడ్డి లాంటి నాయకులు మంచి టూల్ అవుతారు. ఒక్కోసారి అనిరుధ్ మాటలు పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నాయి. కానీ, అప్పుడప్పుడు ఆయన చేసే అతి వ్యాఖ్యలు మిత్రపక్షాలనో లేదా తటస్థ వర్గాలనో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం రేవంత్ రెడ్డి టీంలో అనిరుధ్ ఒక కీలకమైన స్ట్రాటజిక్ ప్లేయర్ అన్నది కాదనలేని నిజం. చివరిగా.. అనిరుధ్ రెడ్డి మాటలు గాలిలో పేలే బుడగలా? లేక లక్ష్యాన్ని ఛేదించే తూటాలా? అన్నది ముందు ముందు తేలనుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆయన తెలంగాణ రాజకీయాల్లో నోటికి పని చెప్పే ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్