- Advertisement -
తెలంగాణలో మరో 4 రోజులు భారీ వర్షాలు
Another 4 days of heavy rains in Telangana
Jul 27, 2024,
తెలంగాణలో మరో 4 రోజులు భారీ వర్షాలు
తెలంగాణలో మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
- Advertisement -