- Advertisement -
శేరిలింగంపల్లి బిఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. జిహెచ్ఎంసి బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఆయన సతీమణి హఫీజ్ పేట్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో టిపిసిసి అధ్యక్షులు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పి ఇద్దరు దంపతులను ఆహ్వానించారు. ఇప్పటికే కంటోన్మెంట్ నియోజకవర్గంలో శ్రీ గణేష్ సైతం హస్తం పార్టీలో చేరగా తాజాగా జగదీశ్వర్ గౌడ్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మరింత బలం పుంజుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

- Advertisement -



