Thursday, September 19, 2024

మణికొండ టౌన్ ప్లానింగ్ లో మరో శివ బాలక్రిష్ణ?

- Advertisement -

రాజేంద్రనగర్:-
సి.వి ఆనంద్ సార్ జరా దేఖ్….?
మణికొండ టౌన్ ప్లానింగ్ లో మరో శివ బాలక్రిష్ణ?
రెండేళ్లలోనే రూ.60 కోట్ల పైగా అక్రమ సంపాదన
ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల విలువ రూ.100 కోట్లపైనే
ఎక్కడ అనుమతులు కావాలన్నా ఈయన జేబు నింపాల్సిందే
మునిసిపాలిటీని పీల్చి పిప్పి చేసి వెళ్లిపోయిన అధికారి
గతంలో విధుల నుంచి సస్పెన్షన్..
అయినా మారని బుద్ధి
ఏసీబీ సీవీ ఆనంద్ సారూ.. ఓసారి మణికొండపై కన్నేయరూ?
రాజేంద్రనగర్ ఫిబ్రవరి 25(వాయిస్ టుడే ):-
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న పేరు శివ బాలక్రిష్ణ.. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేసిన సమయంలో ఆయన రూ.కోట్లకు పడగలెత్తారు. మరీ ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో ఆయన అక్రమాలు కోకొల్లలు అని చెబుతున్నారు. దీంతోనే ఏసీబీ దాడులకు పాల్పడింది. పన్నెండేళ్లలో శివబాలకృష్ణ ఆదాయం రూ.2.48 కోట్లు కాగా.. ఆయన ఆర్జించిన ఆస్తులు ప్రభుత్వ ధరల ప్రకారమే రూ.8.26 కోట్లుగా ఏసీబీ గుర్తించింది. అయితే, వీటి మార్కెట్ విలువ రూ.250-రూ.500 కోట్లు ఉంటుందని అంచనా. అంతెందుకు.. ఓ ఐఏఎస్ అధికారికి ఆయన ఇచ్చిన నగదే రూ.10 కోట్లు అంటే ఈ టౌన్ ప్లానింగ్ అధికారి అవినీతి స్థాయి ఏమిటో తెలుస్తోంది.
ఇక్కడా ఓ జూనియర్ శివబాలకృష్ణ
శివబాలకృష్ణ పనిచేసేది హెచ్ఎండీఏ హెడాఫీస్ లో.. ఆ పెద్ద సారును ఆదర్శంగా తీసుకున్నాడేమో..? మణికొండలో అచ్చం అలాగే.. ఓ చిన్న శివబాలకృష్ణ తయారయ్యాడు. మునిసిపాలిటీలో అంతా హవా నడిపించాడు. ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు, అక్యుపేషన్ సర్టిఫికెట్లు (ఓసీలు), నార్సింగి మునిసిపల్ స్థలాలలొ మణికొండ మునిసిపల్ పర్మిషన్లు, ప్రొసీడింగ్ లెటర్ రాకముందే బిల్డింగ్ పూర్తి, రోడ్డు విస్తరణ కోసం మార్కింగ్ వేయగా.. ఓ నిర్మాణదారు సెట్ బ్యాక్ వదలకుండా పూర్తిచేస్తున్నాడు. ఇప్పుడు ఆరో అంతస్తు నిర్మాణంలో ఉంది. దీనికి కూడా ముడుపులు అందుకున్నారు. ఇలా అవినీతిలో తన విశ్వరూపం చూపారని మణికొండ ప్రజలు పేర్కొంటున్నారు. శివబాలకృష్ణ ఉదంతం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈయనను అందరూ గుర్తుచేసుకుంటుండడం విశేషం. బహుశా శివబాలకృష్ణనే ఆదర్శంగా తీసుకున్నాడేమో..? ఆయనలాగే కోట్లకు పడగలెత్తాలని కలలు కన్నాడేమో..? అందినకాడల్లా ఆమ్యామ్యాలు తీసుకున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు.
అతడికి అక్రమాల మణి కొండ
మణికొండ అంటే ఇప్పుడు ఓ ఖరీదైన ప్రాంతం. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులతో పాటు ఐటీ ఉద్యోగులు, మధ్య తరగతి వారు అందరికీ ఓ నివాస ప్రాంతంగా మారుతోంది. అలాంటిచోట జూనియర్ శివబాలకృష్ణ అక్రమాలు, అవినీతి రాజ్యం నడిపించాడనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి ఆయన మునిసిపాలిటీలో పనిచేసింది కొన్నేళ్లే.. కానీ, ఈ కాలంలో రూ.కోట్లు పోగేసుకున్నాడు. అంతకుముందు పనిచేసినచోటల్లా అక్రమ సంపాదనకు తెగబడి రూ.కోట్లకు పడగెత్తాడు. కానీ, మణికొండలో మాత్రమే మరింత ఎక్కువ సంపాదించాడని చెబుతారు.

మణికొండలో రూ.65 కోట్లు.. మొత్తం ఆస్తులు రూ.100 కోట్లుపైనే
మణికొండ జూనియర్ శివబాలకృష్ణ ఇక్కడ పనిచేసిన కాలంలో అక్రమంగా ఆర్జించినది ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.65 కోట్లు అని సమాచారం. అంతేకాదు.. ఆ యన ఇప్పటివరకు పోగేసిన అక్రమాస్తుల విలువ రూ.100 కోట్లు పైనే ఉంటుందని చెబుతారు. చిన్నాచితక ఉద్యోగులపై దాడులకు దిగే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మణికొండ జూనియర్ శివబాలకృష్ణను ఎందుకు ఉపేక్షిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. అందులోనూ హెచ్ఎండీఏలో పెద్ద అవినీతి తిమింగలం శివబాలకృష్ణను వేటాడిన ఏసీబీ మణికొండలోని జూనియర్ శివబాలకృష్ణ సంగతి చూడాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు
బదిలీ రోజు కూడా జేబులు నింపుకొన్నాడు ఈ
మణికొండ జూనియర్ శివబాలకృష్ణ
నిండా జేబులు నింపుకొని ఇటీవలే చెక్కేశాడు. అయితే బదిలీ ముందు రోజు కూడా ఆక్యుపేషన్ సర్టిఫికెట్ (ఓసీ) కోసం ప్రతి బిల్డర్ వద్ద డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. అనంతరం ఆయన బదిలీ కావడంతో ఇప్పుడు నిర్మాణదారులు అయోమయంలో పడ్డారు. అధికారి మాత్రం హమ్మయ్య తనను ఎవరూ ఏమీచేయలేరనే ధీమాలో ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఆయన ఎక్కడ పనిచేసినా ‘అవినీతి అనకొండనే’. అంటే కొత్త పోస్టింగ్ లోనూ ఆ అధికారి అవినీతి కార్యకలాపాలు ఏమాత్రం ఆగవు. ఈ నేపథ్యంలో ఏసీబీ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ ఒక్కసారి ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

వాయిస్ టుడే వద్ద అన్ని ఆధారాలు

మణికొండ జూనియర్ శివబాలకృష్ణ అవినీతి వ్యవహారాలకు సంబంధించిన అన్ని ఉదాహరణలు, డాక్యుమెంట్లు సహా ఆధారాలు వాయిస్ టుడే వద్ద ఉన్నాయి. ఆయన సాగించిన అక్రమాల చిట్టా విప్పేందుకు కొన్నిపేజీల కొద్దీ కథనాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క అంశంలో ఏయే విధంగా అక్రమాలకు తెగించాడు..? ఎక్కడెక్కడ? ఎవరినుంచి డబ్బు గుంజాడు..? వంటి వివరాలన్నీ సంపాదించింది వాయిస్ టుడే అయితే, త్వరలో వీటిని ఒక సిరీస్ గా కథనాలు ఇవ్వనుంది. తద్వారా ఏసీబీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్