మాజీ ఎమ్మెల్యే సోమారపు. సత్యనారాయణ.
ఇండిపెండెంట్ గా ఎలక్షన్ లో పోటీ…!
సెప్టెంబర్.30 (వాయిస్ టుడే): గోదావరిఖని భారతీయ జనతా పార్టీకి రామగుండం నియోజక వర్గంలో బిజెపికి షాక్ తగిలింది. ఇటీవలే కౌశిక్ హరి రాజీ నామా చేసి భారాస వైపు వెళ్లగా, తాజాగా మాజీ ఎమ్మెల్యే, టీఎస్ఆర్టిసి మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ సైతం భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గా ఈరోజు విలేకరుల సమావేశంలో సోమవారం సత్యనారాయణ మాట్లాడుతూ… భారతీయ జనతా పార్టీలో తనదైన శైలిలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన సోమవారం సత్యనారాయణ రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టిఆర్ఎస్ కు నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకత ఎక్కువ ఉండడంతో, ఇండిపెండెంట్గా పోటీ చేసి రామగుండంలో గెలవాలని సదుద్దేశంతోనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన అనుచర వర్గీయులు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తేనే గెలుస్తావని ఒత్తిడి చేశారు సోమారపు సత్యనారాయణ తెలిపారు.. రామగుండం నియోజకవర్గంలో సైతం సోమారపు సత్యనారాయణ లాంటి వారు ఉంటేనే గెలుస్తారనే భావనతో ప్రజలు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. గతంలో చేసిన అభివృద్ధిని చూసి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు సోమారపు అన్నారు. మాజి మేయర్ జాలి రాజమణి, మాజీ కార్పొరేటర్లు పిడుగు కృష్ణ, కోదాటి ప్రవీణ్, వడ్లూరి రవి, అరే దేవకర్ణ, మామిడాల చంద్రయ్య, సోమరపు అరుణ్ ,మాడ నారాయణ రెడ్డి ,పతి సంజీవ్, పవణ్, డేవిడ్ రాజు, సంపంగి శ్రీనివాస, జనగమా రాజలింగు ,కుసుమ , సుబాష్, మంచికట్ల బిక్షపతి ,చంద్రశేకర్ ,సాగి కిషన్రావు , వాసు సురెష్, కిశోర్ తదితరులు పాల్గోన్నారు ..



