Tuesday, January 21, 2025

ఇందిరమ్మ ఇళ్లలో మరో ముందడుగు

- Advertisement -

ఇందిరమ్మ ఇళ్లలో మరో ముందడుగు

Another step forward in Indiramma houses

హైదరాబాద్, డిసెంబర్ 6, (వాయిస్ టుడే)
తెలంగాణ ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను నెరవేర్చేందుకు ముందడుగు వేసింది. అయితే ఈ పథకం ద్వారా లబ్ది పొందడం ఎలా? అసలు ఇంటి నిర్మాణానికి ఎంత డబ్బు ప్రభుత్వం అందజేస్తుంది? ఎన్ని గృహాలు మంజూరు కానున్నాయనే విషయాలను తెలుసుకుందాంచెప్పిన మాట చెప్పినట్లుగా పాటించడం మా నైజం. ఇచ్చిన హామీ ఇచ్చినట్లుగా నెరవేర్చడమే మా ధ్యేయం. పేదవారి సొంతింటి కలను నెరవేరుస్తామని చెప్పాం. చేసి చూపించాం అంటూ ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సంధర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం యాప్ ను ప్రవేశపెట్టింది. ఆ యాప్ ఆధారంగా రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను గుర్తించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం.ఇక పథకం వివరాలలోకి వెళితే.. 2004 నుండి 2014 వరకు ఇందిరమ్మ పథకంలో భాగంగా 25 లక్షలకు పైగా గృహాల నిర్మాణం జరిగింది. మరలా 2014 నుండి 2014 వరకు బీఆర్ఎస్ పాలనలో కేవలం 65 వేల గృహాలు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నట్లు అధికారిక లెక్క. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తమ 5 ఏళ్ల కాలవ్యవధిలో ఏకంగా 25 లక్షల గృహాలు మంజూరు చేయాలని సంకల్పించింది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇళ్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు దరఖాస్తులను స్వీకరించింది.ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల లబ్ది గురించి దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ప్రభుత్వం ఓ యాప్ ను ఏర్పాటు చేసింది. లబ్దిదారులు ఇంటి వద్ద ఉంటే చాలు.. అధికారులే మీ ఇంటికి వచ్చేస్తారు. రాజకీయ ప్రమేయం లేకుండా, అర్హత ఉంటే చాలు ఈ పథకంతో మీరు లబ్ది పొందవచ్చు. ఇందిరమ్మ మొబైల్ యాప్ ద్వారా మీ వివరాలను వెరిఫై చేసి, అర్హత ఉంటే మీ సొంతింటి కలను ప్రభుత్వం నెరవేర్చనుంది. అంటే అసలు మీకు ఇళ్లు ఉందా? ఇంటిలో ఎంత మంది సభ్యులు ఉంటున్నారో అధికారులు ముందుగా ధృవీకరిస్తారు.మీరు ఈ పథకానికి అర్హత సాధిస్తే చాలు, ప్రభుత్వం తరపున మీకు రూ. 5 లక్షల సాయం అందుతుంది. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని పెంచిందని చెప్పవచ్చు. ఈ యూనిట్ కాస్ట్ తో 400 చదరపు అడుగుల ఇంటి నిర్మాణం చేసుకొనే వీలుంది. మీకు ఇంటి ప్లాన్ అర్థం కాకున్నా, ఎలా నిర్మించుకోవాలో తెలియకున్నా మీరు డోంట్ వర్రీ. ఎందుకంటే ప్రభుత్వం అందుకు తగ్గ నమూనాలను కూడా తయారు చేసింది. మీరు ఇంకా డబ్బులు వెచ్చించి ఇంటిని నిర్మించుకోవాలని భావించినా, మీ ఇష్టా రీతిలో ఇంటిని మీరు నిర్మించుకోవచ్చు.ప్రతి నియోజకవర్గంలో 3500 గృహాలను ప్రభుత్వం మంజూరు చేయాలని భావిస్తోంది. తొలిదశలో ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్ జెండర్స్, పేదలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే దశలో ప్రభుత్వం నిర్ణయించింది. మరెందుకు ఆలస్యం మీరు నిశ్చింతగా ఉండండి.. మీకు అర్హత ఉంటే చాలు.. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం మీకు రూ. 5 లక్షలు ఇంటి నిర్మాణానికి అందించనుంది.
1.ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యం ఎంత గొప్పదైనా.. అమలులో లోపాలుంటే ప్రభుత్వంపై విశ్వసనీయత దెబ్బతింటుంది. పేదవారికి అన్యాయం జరుగుతుంది. అందుకే సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి ఇళ్లు అనర్హులకు చెందకూడదని ప్రత్యేకంగా యాప్ అందుబాటులోకి తెచ్చామని రేవంత్ రెడ్డి వివరించారు.
2.ఇందిరమ్మ ఇండ్లను ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తామని.. అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కింద ఇండ్ల కేటాయింపు జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు.
3.ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్‌… ఈ క్రమంలో ప్రాధాన్యత ఇస్తూ ఇండ్లను కేటాయిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
4.లబ్ధిదారులు తమకున్న స్థలాన్ని గరిష్టస్థాయిలో వినియోగించుకుని నిర్మించుకునేలా.. ప్రతి మండల కేంద్రంలో ఒక నమూనా ఇంటిని నిర్మించి చూపిస్తామని రేవంత్ వివరించారు. అచ్చం అలాగే కట్టాలని కాకుండా అవగాహన కోసం మాడల్ హౌజ్‌ను చూపిస్తామని చెప్పారు.
5.మొదట ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్ల కేటాయింపు ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. మొత్తంగా 4.50 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులకు పరిపాలనా అనుమతులు ఇచ్చామని వెల్లడించారు.
6.ఆదివాసీలు, ఆదివాసీ తండాలు (ఐటీడీఏ తండాలకు) జనాభా ప్రాతిపదికన ప్రత్యేకంగా పరిశీలించి అదనంగా కొన్ని వేల ఇండ్లను నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పుడు కేటాయించిన ఇండ్లు కాకుండా ఆదివాసీలకు ప్రత్యేక కోటా ఇస్తామని చెప్పారు.
7.గతంలో రుణాలు తీసుకుని ఇండ్లు కట్టుకున్న 7 వేల కుటుంబాల రుణాలను కూడా.. ప్రభుత్వం తీర్చి వారిని రుణ విముక్తులను చేస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.
8.పెరిగిన ధరలు, పేదవాడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి ఇండ్లు కట్టుకోవడానికి అండగా నిలవాలని.. ఈ పథకం తీసుకొచ్చినట్టు సీఎం వివరించారు. అందుకే ప్రతి పేద వాడికి 5 లక్షలు ఇచ్చి ఇండ్లు కట్టుకోవడానికి ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు.
9.ఈ పథకంలో పేదలకు వెసులుబాటు కల్పిస్తూ విధివిధానాలను నిర్ణయించామని సీఎం రేవంత్ చెప్పారు. అదనంగా ఒక గది కట్టుకుంటామంటే అందుకు వెసులుబాటు కల్పించామని వివరించారు.
10.ఇదొక పండగ సందర్భమని.. ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవంతో బతకాలన్నది ప్రతి ఒక్కరి కల అని.. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటిముందు వెలుగుల్లో పండగ చేసుకునే సందర్భమిదని అభిప్రాయపడ్డారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్