Sunday, September 8, 2024

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు..

- Advertisement -

జూలై 4న ఢిల్లీకి చంద్రబాబు
విజయవాడ, జూలై 1,

చంద్రబాబు ఢిల్లీ పర్యటన (Chandrababu visit Delhi):

ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ఢిల్లీ పర్యటన ఖరారైంది. జూలై 4న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో పాటు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. విభజన హామీలతో పాటు మరిన్ని ఆర్థిక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ దృష్ట్యా రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలపై కూడా సుదీర్ఘంగా చర్చించేందుకు వెళ్లనున్నట్లు సమాచారం. కేంద్రం ఆమోదించే బడ్జెట్లో ఏపీకి నిధులు గతంకంటే అధికంగా కేటాయించాలని విజ్ఙప్తి చేసేందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. విభజన హామీలను సత్వరం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కోరనున్నారు. దీంతో పాటు పెండింగ్ బకాయిలు, రావల్సిన నిధుల విషయంలో కూడా కేంద్ర పెద్దలను ఒప్పించేందుకు భేటీ కానున్నారు. ఈ భేటీ తరువాత కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై ఒక స్పష్టత వస్తే రాష్ట్ర బడ్జెట్‎పై ముందుకు వెళ్లాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.మోదీ ప్రమాణస్వీకారం తరువాత రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు తొలిసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో ఆయన టూర్‎పై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ఏపీ ప్రజల్లో కూడా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఏపీకి ప్రయోజనాల దృష్ట్యా ఎలాంటి ప్రకటన వెలువడనుంది, ఎన్ని నిధులు వస్తాయన్న చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. ఇదిలా ఉంటే జూన్ 29న ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యమైన బిహార్ సీఎం నితీష్‌ కుమార్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అదే విధంగా ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన చేపట్టనున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కు కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చిస్తారా అన్న కోణంలో కూడా ఒక వర్గం నుంచి చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి ఢిల్లీ పర్యటనపై తీవ్ర ఆసక్తి అయితే నెలకొంది.అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఓ అంచనాకు వచ్చిన చంద్రబాబు కేంద్ర సాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి మంగళవారం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీని నుంచి బయటపడేందుకు విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కొంత నిధులు సర్ధుబాటు చేస్తే వెసులుబాటు వస్తుందని కేంద్రంతో చర్చించనున్నారు. ముఖ్యంగా అమరావతి, పోలవరం ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు వాటిని ఈ టెర్మ్‌లోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, నిధుల అంశంపై మాట్లాడనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి కేంద్రం నుంచి ఏదో రూపంలో నిధులు రాబట్టుకునేలా ఈ టూర్ ఉంటుందని అంటున్నారు. ఢిల్లీ టూర్‌లో చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్రమంత్రులతో సమావేశంకానున్నారు. విభజన హామీల అమలుపై చర్చించనున్నారు. అదే టైంలో కేంద్ర బడ్జెట్‌లో కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఆ బడ్జెట్‌లో వచ్చిన నిధులు ఇతర అంశాలను ఆధారంగా చేసుకొని ఏపీలో బడ్జెట్‌ రూపొందించనున్నారు. సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులంతా ఆయా శాఖల్లో ఉన్న నిధులు కొరతను చూసి నివ్వెరపోతున్నారు. డిప్యూటీ సీఎం అయితే తనకు జీతం వద్దని, ఆఫీస్ ఫర్నీచర్ కూడా ఇంటి నుంచే తెచ్చుకుంటానని ఛాంబర్‌లో మార్పులు కూడా అవసరం లేదని తేల్చేశారు. ఈ స్థాయిలో నిధుల కొరత ఉన్నప్పుడు అనవసరమైన ఖర్చు తగ్గించుకోవాలని మంత్రులు భావిస్తున్నారు. చంద్రబాబు కూడా పదే పదే ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులతో అద్భుతాలు చేయడం చాలా సంక్లిష్టతో కూడుకున్నదని అన్నారు చంద్రబాబు. అసలు ఆ నిధులు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టారో కూడా తెలియడం లేదని ఇంకా లెక్కలన్నీ తీస్తున్నామని ప్రజలకు తెలిపారు. లోతుగా వెళ్తే తప్ప ఎంత డ్యామేజీ జరిగిందో గుర్తు పట్టలేమన్నారు. ఆ పనిలోనే అధికారులు మంత్రులు ఉన్నారని ఆ వివరాల వస్తే ఆర్థిక స్థితిగతులపై శ్వేత పత్రం విడుదల చేస్తామని అభిప్రాయపడ్డారు. Read More

Follow Us On : Youtube

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్