తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిని చూసైనా ఏపీ సీఎం జగన్ సిగ్గుపడాలి: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

- Advertisement -

విజయవాడ:  రేవంత్ సీఎం కాగానే ప్రగతి భవన్ ముందు బారికేడ్లు తొలగించి, ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు.

జగన్ ముఖ్యమంత్రి కాగానే రూ.9 కోట్ల ప్రజా ధనంతో నిర్మించిన ప్రజా వేదిక కూల్చేశారు.

జగన్ నియంతలా వ్యవహరిస్తూ, రాష్ట్రంలో విధ్వంసక పాలన చేస్తున్నారు.

జగన్ పర్యటనలన్నీ పోలీసుల మోహరింపుల మధ్య, పరదాలు, ముళ్లకంచెల మాటున సాగుతున్నాయి.

గత నాలుగున్నర ఏళ్లలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రజలు కలిసేందుకు జగన్ అనుమతించలేదు.

తమిళనాడు సీఎం స్టాలిన్ ఇప్పటికీ కూడా గత ముఖ్యమంత్రి జయలలిత పేరుతోనే పలు కార్యక్రమాలు కొనసాగించడం గమనార్హం.

జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన వైఖరిలో మార్పు తెచ్చుకుని, ప్రజారంజకంగా పాలన చేయాలి.
– రామకృష్ణ.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular