Thursday, January 16, 2025

ఏపీకి 50 మంది ఎమ్మెల్యేలు

- Advertisement -

ఏపీకి 50 మంది ఎమ్మెల్యేలు

AP has 50 MLAs

విజయవాడ, జనవరి 11, (వాయిస్ టుడే)
ఏపీలోనియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కదలిక వచ్చింది. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని తేలింది. వాస్తవానికి 2014 రాష్ట్ర విభజన తోనే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఇప్పుడు ఉన్న సంఖ్య పెరగాలి. కానీ అలా జరగలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జన గణనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తరువాతనే పునర్విభజన అని సంకేతాలు వచ్చాయి. అయితే జన గణనతో పాటు మహిళా బిల్లు ఆమోదం పొందనుండడంతో.. 2026 లో నియోజకవర్గాల పునర్విభజన అని స్పష్టమౌతోంది. అదే జరిగితే ఏపీలో అదనంగా మరో 5 నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో అసెంబ్లీ స్థానాల సంఖ్య 225 కు పెరగనున్నాయి. అదే జరిగితే రాజకీయ ఆశావహులకు కొంతవరకు అవకాశాలు మెరుగుపడినట్టే.2014లో రాష్ట్ర విభజన జరిగింది. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలతో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటయింది. ఇక తెలంగాణకు సంబంధించి 117 అసెంబ్లీ స్థానాలతో పాటు 17 పార్లమెంటు స్థానాలు మిగిలాయి. ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగడంతో.. పాలనా వికేంద్రీకరణ అవసరమని అప్పటి విభజన బిల్లులో స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తో నియోజకవర్గాల సంఖ్య పెరగాలని అందులో పొందుపరిచారు. కానీ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్నా నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు. కానీ 2026 నాటికి నియోజకవర్గాల పెంపు అనివార్యమని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారంఏపీలో 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఈ లెక్కన 175 స్థానాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో.. ప్రతి లోక్సభ స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు పెంచాలన్న ఆలోచన ఉంది. 2026 ద్వితీయార్థంలో పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది. వీలైనంత త్వరగా పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసి కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రకటించాలని కేంద్రం భావిస్తోంది. కొద్ది రోజుల్లో జన గణనతో పాటు మహిళా బిల్లు కూడా ఆమోదం పొందనుంది. 2025లో జనగణను పూర్తిచేసి.. వెనువెంటనే మహిళా బిల్లును సైతం ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. అటు తరువాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది.ప్రస్తుతం ఏపీలో టిడిపి, వైసిపి, జనసేన, బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నాయి. టిడిపి కూటమిలో బిజెపి, జనసేన ఉంది. ప్రతిపక్ష హోదా దక్కకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాత్రం వైసిపి. అదే సమయంలో కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు కూడా ఉన్నాయి. అయితే అన్ని పార్టీల్లో నాయకులు ఆశావహులుగా ఉన్నారు. ప్రధానంగా టిడిపి కూటమి, వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం చట్టసభలకు ఎన్నిక కావాలని భావిస్తున్నారు. ఒకవేళ పునర్విభజనతో 50 అసెంబ్లీ స్థానాలు పెరిగితే.. అన్ని పార్టీల్లో ఉన్న ఆశావహులకు చాన్స్ దక్కే అవకాశం ఉంది. అందుకే ఏపీ నేతలు నియోజకవర్గాల పునర్విభజనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 2026 నాటికి ఇది కార్యరూపం దాల్చుతుందని తెలియడంతో సంతోషపడుతున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్