నందిగం సురేశ్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసిన ఏపీ హైకోర్టు

- Advertisement -

నందిగం సురేశ్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసిన ఏపీ హైకోర్టు

AP High Court dismissed Nandigam Suresh's bail petition

అమరావతి నవంబర్ 6
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఉండవల్లిలో జరిగిన మరియమ్మ హత్య కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా, ఇదే కేసులో సోమవారంతో ఆయన రిమాండ్‌ ముగిసింది. దీంతో తుళ్లూరు పోలీసులు ఆయన్ను మంగళగిరి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి మరో 14 రోజులకు రిమాండ్‌ పొడిగించారు.2020 డిసెంబర్‌లో వెలగపూడిలో రెండు సామాజిక వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ అల్లర్లలో ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. మహిళ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అప్పట్లో తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ 78వ నిందితుడిగా ఉన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular