Tuesday, May 19, 2026

పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గధామం

- Advertisement -

పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గధామం

AP is a paradise for investors

రానున్న రోజుల్లో ప్రపంచ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు
గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ముందుకెళుతున్నాము.

ఏపీకి గూగుల్ వస్తే గేమ్ ఛేంజర్ అవుతుంది
అగ్రిటెక్, మెడ్‌టెక్‌ రంగాలపై బిల్ గేట్స్ తో చర్చించాం

పెట్టుబడులకు నెట్వర్క్ చేయడానికి దావోస్ పర్యటన ఉపయోగపడింది
వ్యవస్థలను విధ్వంసం చేసినవాళ్లు మాపై విమర్శలా

దావోస్ పర్యటన వివరాలు వెల్లడించిన సీఎం చంద్రబాబు నాయుడు  \

అమరావతి,
విధ్వంసమైన ఏపీని గాడిలో పెడుతున్నాం. కేవలం 7 నెలల్లోనే ఏపీ బ్రాండ్ ను పునరుద్ధరించాం. దావోస్ పర్యటన విజయవంతమైంది. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రాబోతున్నాయి. భవిష్యత్ లో ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా తయారుచేస్తాం. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దావోస్ పర్యటన వివరాలను సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాకు వివరించారు.

భారత్ నుంచి దావోస్ వెళ్లాలనే నిర్ణయం నాదే

దావోస్ నాకు కొత్త కాదు. ఈ దేశంలో మొదటిసారి దావోస్ కి వెళ్లాలని  నిర్ణయించిందింది నేనే. 1995లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. 1997 నుంచి దావోస్ క్రమం తప్పకుండా వెళ్లాను. 1991లో ఆర్థిక సంస్కరణలు రాగా 1995లో ఇంటర్నెట్ విప్లవం వచ్చింది. మొదట్లో దావోస్ కి వెళ్లేప్పుడు మాకు చాలా ఇబ్బందులు వచ్చేవి. హైదరాబాద్ అని చెప్తే…ఏ హైదరాబాద్..పాకిస్తాన్ లోదా అని అడిగేవారు. పెట్టుబడులు పెట్టమని అడిగితే …హైదరాబాద్ కి ఎలా రావాలని అడిగేవారు. అప్పట్లో అలా ఉండేది పరిస్థితి. దావోస్ వచ్చేందుకు మన దేశ రాజకీయ నాయకులు పెద్దగా ఇష్టపడేవారు కాదు. దావోస్ అంటే డబ్బున్నవాణ్ణే సమావేశమవుతారు…మనం వెళితే రిచ్ గా భావించి ఓట్లు పడవని భయపడేవారు. నా తర్వాత కర్ణాటక నుంచి ఎస్ ఎం కృష్ణ వచ్చారు. నాకూ ఆయనకు పోటీ ఉండేది. ఆయన బెంగుళూరు గురించి నేను హైదరాబాద్ గురించి ఎక్కువగా ప్రమోట్ చేసేవాళ్లం. హైదరాబాద్ లో ఏముందని ప్రశ్నించిన ఎస్ ఎం కృష్ణ ఆ తర్వాత…. ఏపీ సీఎం తో కలిసి పనిచేస్తానని స్వయంగా చెప్పారు. ఒకప్పుడు హైదరాబాద్ ప్రమోట్ చేశావు…ఇప్పుడు ఏపీకి ప్రమోట్ చేస్తున్నావు కదా అని మొన్నటి దావోస్ పర్యటనలో బిల్ గేట్స్ నన్ను అడిగారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్